ఒక మనిషికి మామూలుగా దగ్గు జలుబు లాంటివి ఉంటే అసలేం తోచదు.. అలాంటిది.. కరోనా వచ్చి శ్వాసను పూర్తిగా బంధిస్తూ, ఏకధాటిగా దగ్గును కలిగిస్తుంటే ఆ రోగి పడే నరకం మామూలుగా ఉండదు.. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారు పడుతున్న ఇబ్బందులను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఆ బాధ అనుభవించడం కంటే చావడం మేలనిపించేలా ఉంది ఈ రోగం.. ఇక చైనా వాడు తయారు చేసిన ఏ వస్తువుకు గ్యారంటీ లేదు.. కానీ ఈ కరోనాకు మాత్రం అమృతం తాగిపించి మరీ పంపినట్టుగా ఉన్నాడు.. చాలా స్ట్రాంగ్‌గా తన ప్రతాపాన్ని చూపిస్తుంది..

 

 

ఇకపోతే కరోనాను నివారిద్దాం అని చెపుతున్నారే గానీ దాదాపుగా చాలమంది ప్రజలు ఆచరించడం లేదు.. అందువల్ల రోజు రోజుకు భారత్‌లో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650 దాటింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రులు కరోనా రోగులతో, వైరస్ లక్షణాలు ఉన్నవారితో నిండిపోతున్నాయి. అయితే ఈ వైరస్ బారిన పడ్డ వారు ముఖ్యంగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా అధికశాతం రోగులు మాత్రం శ్వాససంబంధిత సమస్యతో సతమతమవుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం చైనాలోని వూహాన్ వైద్యులు ఓ పరిష్కారం చెబుతున్నారు.

 

 

అదేమంటే ఇలా  శ్వాససంబంధిత సమస్యతో సతమతమవుతున్న వారు తలకిందకు వంచి మంచంపై బోర్లా పడుకుంటే శ్వాస తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. ఇలా ఎందుకంటే ఈ భంగిమలో రోగి నిద్రించినప్పుడు శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తోందని పేర్కొన్నారు.. ఈ విషయాన్ని 12 మంది కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులపై అధ్యయనం జరిపి అనంతరం కనుగొన్నారట.. వూహాన్‌లోని జిన్‌యింటాన్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం.. కాబట్టి శ్వాసకోశ సంబంధిత వ్యాదులతో బాధపడే వారు ఇలా చేసి కాస్త ఉపశమనాన్ని పొందవచ్చట..

మరింత సమాచారం తెలుసుకోండి: