భారత దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతుంది. చిన్నా, పెద్ద సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉంటూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.  అయితే కరోనా ఇప్పటికే దేశంలో 500 వందల మందికి పైగా కేసులు నమోదు అయ్యాయి.  ఇలా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.  లాక్ డౌన్ సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు ఇంటిపట్టున ఉంటూ తమకు తోచిన పనులు చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మాద్యమాల్లో షేర్ చేస్తున్నారు.  మొన్న కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి  వంటింట్లో కర్రీ చేస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. 

 

ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తాము ఇంట్లో ఏం పనులు చేస్తున్నామో అంటూ ఫన్నీగా  ఫోటోలు సోషల్ మాద్యమాల ద్వారా పోస్ట్ చేస్తున్నారు.  తాజాగా దొరికిన అవకాశాన్ని పలు రకాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటి పనుల్లో భార్యకు సాయపడుతున్నారు. పనిమనుషులు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో ఇంటి పట్టున ఉంటున్న భర్తలు వారి లేని లోటు తీరుస్తూ అర్ధాంగికి పనిలో అర్ధభాగం సహకరిస్తున్నారు.  తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చీపురుపట్టి వంటగదిని శుభ్రం చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

మొత్తానికి ఈ ఫోటో చూస్తుంటే..  రాజకీయ నాయకులు కూడా అతీతులేం కాదని తాజాగా బయటకు వచ్చిన ఓ ఫొటో నిరూపిస్తోంది.  అత్యంత సాధారణ వ్యక్తిలా చీపురు పట్టుకుని ఇల్లు ఊడుస్తున్న ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని.. ఇంట్లో ఉంటూ కరోనాని కట్టడి చేయొచ్చు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు ఇస్తున్న విషయం తెలిసిందే. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple   

మరింత సమాచారం తెలుసుకోండి: