కరోనా వైరస్ హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్నవారికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. హాస్టళ్లు మాస్తారన్న సమాచారంతో వాటిలో ఉండే వారు ఆందోళన చెందారు. తమను తమ ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ల ముందు బారులు కట్టిన సంగతి తెలిసిందే. వారిని ఏపీలోకి అనుమతించేందుకు అక్కడి సర్కారు కూడా వెనుకాడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

 

 

హైదరాబాద్ లోని హాస్టళ్లలో నాణ్యత, శుచి, శుభ్రతతో కూడిన భోజనాన్ని ఉచితంగా సరఫరా చేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. విద్యార్థులు ఎప్పటిలాగే కొనసాగవచ్చని స్పష్టం చేశారు. యాజమాన్యాలు విద్యార్థులను, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయొద్దని హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు.. హాస్టళ్లను మూసేయాలని నిర్ణయించారు.

 

 

హాస్టల్ విద్యార్థుల నుంచి వచ్చిన ప్రతిఘటనతో హాస్టళ్లను మూసేయాలన్న నిర్ణయంపై అధికారులు వెనక్కి తగ్గారు. లక్షకుపైగా విద్యార్థులు, ఉద్యోగుల జీవనం అగమ్యగోచరం కావొద్దన్న ఆలోచనతో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా హాస్టల్ మేనేజ్‌మెంట్లకు ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ప్రభుత్వమే హాస్టళ్లకు భోజనం సరఫరా చేస్తుందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రకటన చేశారు. మేయర్ ప్రకటనతో హైదరాబాద్‌ మహా నగరంలో ఉన్న 2 వేల హాస్టళ్లలో ఉండేవారికి ఊరట దక్కనుంది.

 

 

నిన్న అంతా హైదరాబాద్‌లో హాస్టల్ వాసుల ఆందోళనలతో పోలీస్ స్టేషన్లు హోరెత్తాయి. కొందరు హాస్టళ్లలో ఉండేవారు తమ దీనావస్థను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. చివరకు మేయర్‌ రామ్మోహన్‌ చొరవతో సమస్య పరిష్కారమైంది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: