తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఏంటి.. దేశమంతటా ఉంది. మరి ఈ సమయంలో బయటకు వెళ్లాలంటే.. ఏదైనా సరైన కారణం ఉండాలి. నిత్యావసరాలు తెచ్చుకోవాలంటే బండిపై ఒక్కరే బయటకు వెళ్లాలన్న నిబంధన ఉంది. అదే కారైతే.. డ్రైవర్ తో పాటు ఇంకొకరికే అవకాశం. మరి ఇద్దరు ముగ్గురు వెళ్లాలంటే.. ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. లేకపోతే పోలీసులు తాట తీస్తున్నారు.

 

 

అయితే పరిస్థితి ఇంత సీరియస్ గా ఉన్నా కూడా కొందరు మాత్రం తప్పుడు కారణాలు చూపి బయట తిరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులను కూడా బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సాకులు చెప్పే సమయంలో అంతులేని క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఇలాంటి పోకిరీలు చెప్పే సమాధానాలు విని చివరకు పోలీసులే షాకవుతున్నారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు.

 

 

ఇంతకీ వాళ్లు చెప్పే సాకులేంటో తెలుసా.. ఒక ఫొటో చూపించి ఈయన కనిపించడం లేదు వెదుకుతున్నామంటారు కొందరు. పాపం పోలీసులు నిజమే అని ఆ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపారట. డౌటొచ్చి గట్టిగా అడిగితే.. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా.. లాంగ్‌ డ్రైవ్‌కు వచ్చామన్నారట పోకిరీ వెధవలు. ఇంకొందరు రక్తదానం చేసేందుకు ఆసుపత్రికి వెళ్తున్నామని మస్కా కొట్టబోయారట.

 

 

ఆసుపత్రికి వెళ్తున్నామని కొందరు.. మా వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారు డబ్బులు కట్టాలని కొందరు.. ఇలా రకరకాల వేషాలు వేశారట. కానీ పోలీసులు ఇలాంటి వాళ్లను సింపుల్ గా పట్టేస్తారు కదా. మీరు కూడా అలాంటి సాహసాలు చేయకండి దూలతీరిపోగలదు జాగ్రత్త.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: