ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. క‌రోనా పేరు చెపితే ఇప్ప‌డు పెద్ద పెద్ద దేశాలు సైతం వ‌ణికి పోతున్నాయి. ఇక ఇట‌లీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే అక్క‌డ మృతుల సంఖ్య ఏకంగా 8 వేలు దాటేసింది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి సోకిన దేశాల సంఖ్య 200కు చేరువ అవుతోంది. ఇంకా చెప్పాలంటే ప్ర‌పంచంలో క‌రోనా భారీన ప‌డ‌ని దేశం అంటూ ఉండ‌ద‌ని కూడా ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే ఈ వైరస్ బారిన పడిన 3 లక్షల మంది అనారోగ్యం పాలవగా 20 వేలకు మించిన జనం మృత్యువాత పడ్డారు. 

 

అయితే ప్రపంచంలోని అన్ని అగ్ర దేశాల‌తో పాటు ప్ర‌పంచంలో ప్ర‌తి గ్రామాన్ని భ‌య పెడుతోన్న ఈ వైర‌స్ ఒక ప్ర‌దేశంలోకి మాత్రం వెళ్లే ఛాన్సే లేద‌ట‌. అయితే ఒక్క క‌రోనా వైర‌స్ మాత్ర‌మే కాదు ఏ వ్యాధి కూడా అక్క‌డ‌కు వెళ్ల‌ద‌ట‌. ప్ర‌పంచంలో ఏ వ్యాధి కూడా వెళ్ల‌ని అత్యంత సుర‌క్షిత ప్రాంత‌మ‌ట‌. ఎందుకంటే అక్కడ హెల్త్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నేళ్ల తరబడి అత్యుత్తమంగా కొనసాగుతోంది. అమెరికా అంతరిక్ష కేంద్రం (నాసా) చెప్పినదాని ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యంత సురక్షిత ప్రదేశం. ఇన్నేళ్లలో ఇక్కడ ఒక వ్యక్తికి ఒక్కసారి మాత్రమే జలుబు వచ్చింది. అదికూడా 52 ఏళ్ల క్రితం అట‌. దీనిని బ‌ట్టి ఈ ప్రాంతం వ్యాధులు వ‌చ్చే ప‌రిస్థితి లేనంత స్ట్రాంగ్ వాతావ‌ర‌ణంలో ఉంద‌ని తెలుస్తోంది. 

 

ఇక ఆ ప్ర‌దేశం ఏదో కాదు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్). అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్‌ను పంపించేముందు నాసా శాస్త్రవేత్తలు సంబంధిత వ్యక్తికి 10 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంత‌రం అక్క‌డ నుంచి వాళ్లు అంత రిక్షంలోకి వెళ‌తారు. వ‌చ్చే మే నెల‌లో స్పేస్- ఎక్స్‌కు చెందిన రాకెట్ నుంచి అంతరిక్ష యాత్రికులను స్పేస్ స్టేషన్‌కు పంపించనుంది. 

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: