కరోనా మహమ్మారి దెబ్బ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అబ్బా అంటున్నారు. కరోనా మరణాలు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక కరోనా వైరస్‌ ప్రభావంతో ఎన్నో రంగాలు దెబ్బతింటున్నాయి. కొన్ని కోలుకోలేనంతగా నష్టపోతుండగా మరికొన్ని ఊగిసలాడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలవుతుండగా ప్రైవేటు వ్యాపారాలు నిలువునా పడిపోతున్నాయి. అలాగే క‌రోనా దెబ్బ పెళ్లిళ్ల‌పై కూడా ప‌డింది. వివాహ వైభవాలు కేవలం రక్తసంబంధీకులకే పరిమితం అవుతున్నాయి. 

 

పెళ్లిళ్లకు రారండి.. అంటూ ఆహ్వాన పత్రికలు పంచిన వారే తిరిగి తమ పెళ్లిళ్లకు రావద్దని బంధువులకు, స్నేహితులకు సెల్‌ ఫోన్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో ఈ నెల 26, 28, 29 తేదీల్లో జరగాల్సిన పెళ్లిళ్లకు జిల్లాలోని పలు కుటుంబాలు శుభ లేఖలు కూడా పంచిపెట్టేశారు. అన్నింటికీ ఆర్డర్లు ఇచ్చేసి...అడ్వాన్సులు కూడా చెల్లించేసి పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. అయితే రోజురోజుకూ కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతుండడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎక్కువ కావడంతో పునరాలోచనల్లో పడ్డారు. అలాగే జిల్లాలో కరోనా వైరస్‌ అలజడి వచ్చిన తర్వాత జరగాల్సిన పెళ్లిళ్లు జిల్లాలో దాదాపు 230 వరకూ ఉన్నట్లు తెలిసింది. 

 

ఈ పెళ్లిళ్ల కుటుంబాల వారు తమ తమ ఆర్థిక  తాహతును బట్టి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చులు చేసేవారున్నారు. ఇక కల్యాణ మండపాలకే కాకుండా బ్యాండ్‌ మేళాలు, భోజనాలు, వంట పాత్రలు,  షామియానాలు, విద్యుద్దీపాలు, వేదికల అలంకరణ, శుభ లేఖల ముద్రణ తదితర ఈవెంట్స్‌కు అడ్వాన్సుల పేరుతో జిల్లా వ్యాప్తంగా రూ.1.50 కోట్ల వరకూ వెచ్చించినట్టు తెలుస్తోంది. కానీ, క‌రోనా దెబ్బ‌కు దీరింద‌రూ వెనుక‌డుగు వేశారు. అలాగే నిశ్చితార్థాలు ముగించుకుని ఏప్రిల్, మే నెలల్లో ముహూర్తాలు పెట్టించుకుందామనుకుంటున్న వారు కరోనా తీవ్రత, ఆంక్షలతో ఆగస్టు నెలకు అంటే దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేసుకుంటున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: