ప్రస్తుతం ఎటు చుసిన అందరి నోటా ఒకే మాట. ఎటు చుసిన కరోనా వైరస్ గురించే చర్చించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తూ ఈ మహ్మమరిని అరికట్టడానికి ఇంకా వ్యాక్సిన్ కనుకోలేదు. అదికాక ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుందున్న అందరిని భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇటలీలో రోజుకు కొన్ని వందల మంది చనిపోతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా పరిస్థితి కూడా అంతే. ఇంకాపోతే ఈ వైరస్ మన దేశంలోను చాప కింద నీరులా వ్యాపిస్తూ ఉంటుంది. 

 

ఇప్పటికే దేశంలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఈ వైరస్ వ్యాపించకుండా ఉండడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ విధించినప్పుడు ఇంట్లో నుండి బయటికి వచ్చిన వారికీ పోలీసులు చితకబాదుతున్నారు. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దేశంలో 664 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దేశంలో 12మంది ఈ కరోనా వైరస్ తో చనిపోయారు.

 

ఈ వ్యాధి రానున్న రోజుల్లో ఎక్కువ మందికి సోకే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఐదు లక్షల మంది దాక ఈ వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ఒక్కే మార్గం ఉంది. అది పరిశుభ్రత, స్వీయ గృహనిర్బంధం పాటించడం వలన కొంతవరకు ఈ వ్యాధిని అరికట్ట వచ్చును. 

 

అయితే తాజాగా భారతీయులకు ఒక్క గుడ్ న్యూస్ వచ్చింది. వేడి, తేమ తక్కువగా ఉన్న వాతావరణం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని వారు తెలిపారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కరోనా బాధితులపై చేసిన అధ్యయనంలో ఈ నిజం తెలిసిందన్నారు.

 

ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందిన దేశాల్లో ఉష్ణోగ్రత 3 నుంచి 17 డిగ్రీల మధ్యే ఉంటుంది. ఇండియా, బ్రెజిల్, మలేసియా, అమెరికాలోని ఫ్లొరిడా, లూసియానా, రాష్ట్రాల్లో కొత్త కేసులు తక్కువగా ఉండటానికి కారణం అదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ కి అడ్డుకట్ట వేయడానికి ఉష్ణోగ్రత ఒక్కటేనన్నారు. దీనికి తేమ ప్రధాన పాత్ర వహిస్తుందని వివరించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: