ప్రపంచంలో కరోనా ఎంత బీభత్సం సృష్టిందో తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 20 వేలకు పైగా మరణాలు సంబవించాయి.. ఈ సంఖ్య ప్రతిరోజూ పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు ఎదురుగా తారస పడినా సామాజిక దూరం అవలంభించాలని సూచిస్తున్నారు.  కరోనా వైరస్ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను గుంపులుగా తిరగనివ్వడంలేదు. ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకుండా లాక్‌డౌన్ విధించారు.  సామాజిక దూరం పాటించాలన్న విషయంపై కొంత మందికి అవగాహన లేక ఒకే దగ్గర ఉండటం తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  

 

తాజాగా ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం లెక్క చేయకుండా విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వచ్చే అవకాశం ఉందని.. దూరం పాటించమన్నందుకు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చేశాడు. తమిళనాడులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. ఊటీలో కూలీ పనులు చేసుకునే ప జోతిమణి(40) అనే వ్యక్తి ఓ హోటల్‌లో భోజనం చేస్తున్నాడు. పక్కనే బేకరిలో ఓ యువకుడు పని చేస్తున్నాడు.. పేరు దేవదాస్(43).  అతను అదే హూటల్ కి టీ తాగడానికి వచ్చాడు.  అయితే బోజనం చేయడానికి రెడీ అవుతున్న జోతిమణి పక్కనే కూర్చోబోయాడు. దాంతో అతను కరోనా వైరస్ వస్తుంది... కాస్త సామాజిక దూరం పాటిద్దం.. పక్కన కూర్చోమని చెప్పాడు.

 

నాకేమైనా కరోనా ఉందా.. నన్నే పక్కన కూర్చోమంటావా అంటూ దేవదాస్ కి కోపం రావడం.. అది కాస్తా పెద్దది కావడంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని జోతిమణి మెడపై పొడిచాడు. అది లోతుగా దిగడంతో ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గించడానికి సామాజిక దూరం పాటించమన్న పాపానికి ఓ నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యక్ష సాక్షులు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: