కరోనా ఎఫెక్ట్ తో దేశంలో  మనిషికి, మనిషికి మధ్య సామాజిక దూరం పాటించాలని కూడా సూచిస్తున్నారు. కానీ కొంత మంది వీటిని పట్టించుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఇందుకోసం ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి వద్ద ఉండాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసి చెబుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, బయటకు రాకుండా 21 రోజులు ఇంట్లోనే ఉంటె ఖచ్చితంగా వైరస్ పై విజయం  సాధించవచ్చు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి.  దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు నియమాలను ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తున్నాయి. ప్రతిరోజూ వార్తల్లో, సోషల్ మీడియాలో నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నా.. జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. 

 

కొంతమంది ఆకతాయిలు మాత్రం వీటిని పట్టించుకోకుండా రోడ్డుమీదకు వస్తున్నారు.   సరైన కారణం లేకుండా రోడ్డు మీదకు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పటికే ప్రభుత్వం వివరించి చెప్తున్నది.  పోలీసులు ఆపి అడిగితె,  పొంతన లేని విషయాలు చెప్తూ అక్కడి నుంచి తప్పించుకుపోతున్నారు.  ఇక రోడ్లపై మెడికల్ షాపులు, కూరగాయ సెంటర్లు, నిత్యావసర వస్తువులు అమ్మే షాపుల వద్దకు గుంపులు గుంపులుగా వస్తున్నారు. పోలీసులు ప్రశ్నిస్తే అత్యవసర సామాన్ల కోసం వస్తున్నామిన తిక్క సమాధానాలు ఇస్తున్నారు. 

 

కొంత మందిపై పోలీసలు లాఠీలు ఝులిపిస్తున్నా.. మార్పు మాత్రం రావడం లేదు.  జనాలు ఇష్టానుసారంగా బయటకు వచ్చి రైతుబజార్లలో తిరుగుతున్నారు.  కొన్ని రైతు బజార్‌లో గుంపులుగా చేరి కూరాగాయలను విక్రయిస్తున్నారు. సామాజిక దూరం పాటించకుండా ముఖాలకు మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారు. ఇంకొందరైతే రోడ్లు ఖాళీగా ఉన్నాయని లాంగ్ డ్రైవ్ చేయడానికి వచ్చామని చెప్పి పోలీసులకు షాక్ ఇస్తున్నారట.    దీంతో పోలీసులు కూడా కొంచం కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుందని లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుందని అంటున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: