కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయన్న సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటిస్తూ ఏప్రిల్ 14 వరకు ఎవరూ ఇళ్ల నుండి బయటకి రావద్దని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో, నిత్యావసర సరకుల కోసం ప్రజలు బయటకి రావొచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా బయటకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చునట్టు లాఠీలతో కొడుతున్నారు.




ఈ క్రమంలోనే బుధవారం రోజు పశ్చిమ బెంగాల్ లోని హౌరా కి చెందిన లాల్ స్వామి అనే ఓ 32ఏళ్ళ వ్యక్తి పాలు కోసమని బయటకి రాగానే పోలీసులు అతన్ని ఆపి తీవ్రంగా కొట్టగా... అతడు అక్కడిక్కడకే కుప్పకూలాడు. దాంతో అతనితో పాటు వచ్చిన భార్య కేకలు వేయగా కొంతమంది అతడ్ని హుటాహుటిన ఆసుపత్రి కి తరలించగా అక్కడి వైద్యులు ఆయన మార్గ మధ్యంలోనే మరణించాడని చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసుల పై ఆందోళనకు దిగారు. ఆయన భార్య కన్నీరుమున్నీరవుతూ... పోలీసులు కొట్టడం వల్లనే తన భర్త చనిపోయాడని చెబుతుంది. కానీ పోలీసులు మాత్రం అతనికి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడని చెబుతున్నారు.




ఐతే మృతుడికి హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్య పరీక్షలలో తేలింది. ఏది ఏమైనా నిత్యావసర సరకులు కొనుక్కునే స్వేచ్ఛ కూడా లేకపోతే ఎలా 21 రోజుల పాటు జీవించాలని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధం చేసుకోలేని పోలీసులు చచ్చేటట్టు లాఠీ ఛార్జ్ చేయడం ప్రస్తుతం అందరి ఆగ్రహానికి కారణమవుతుంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్ లో ఇప్పటివరకు పది కోవిడ్ 19 కేసులు నమోదు కాగా... ఒకరు కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఐతే 10వ కేసుగా నమోదు అయిన వ్యక్తికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: