కొరోనా వైరస్ నియంత్రణ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఏమి మాట్లాడాలో తెలుగుదేశంపార్టీ జనాలకు అర్ధం కావటం లేదు. అందుకనో నొటొకొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాగీ మొదలుపెట్టేశాడు. నాని తీరు చూస్తుంటే ప్రజలను రెచ్చగొడుతున్నట్లే ఉంది. మొత్తానికి తాను కూడా మిగితా వాళ్ళలాగే చీప్ గానే ఆలోచిస్తానని నిరూపించుకున్నాడు.

 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే విజయవాడ నడిబొడ్డున ఓ ఆసుపత్రిని కొరొనా వ్యాధిగ్రస్తులకు ఐసొలేషన్ వార్డులుగా మార్చకూడదంటూ గోల మొదలుపెట్టాడు. నగరం నడిబొడ్డున ఉన్న ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అనే విచిత్రమైన వాదన మొదలుపెట్టాడు.  ఐసొలేషన్ వార్డులను నగరానికి దూరంగా ఎక్కడో పెట్టాలని ఎంపి డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ ఐసొలేషన్ వార్డులు పెట్టటం మిగిలిన జనాల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదట.

నాని వరస చూస్తుంటే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టేట్లే ఉన్నాడు. అయినా ఆసుపత్రుల్లోనే ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తారన్న కనీసం ఇంగితం కూడా నానికి ఉన్నట్లు లేదు.  నగరానికి ఎక్కడో దూరంగా ఐసొలేషన్ వార్డులు ఏర్పాట్లు చేస్తే వైద్య సిబ్బంది ఎంత ఇబ్బంది పడతారో నాని ఆలోచించినట్లు లేదు. అయినా ఇప్పుడంటే కొరోనా వైరస్ వచ్చింది సరే. మరి రకరకాల ఆసుపత్రులన్నీ నగరం నడిబొడ్డునే కదా ఉన్నాయి. మరి వాటి నుండి మిగిలిన జనాలకు ఇబ్బందులు రాదా ?

 

టిడిపి నేతలు మరీ ఇంత సంకుచితంగా ఎలా ఆలోచిస్తున్నారో కూడా అర్ధం కావటం లేదు. నగరం నడొబొడ్డున వద్దని ఎంపి అన్నాడు బాగానే ఉంది. మరి ఎక్కడ పెట్టినా అక్కడి ప్రజా ప్రతినిధులు వద్దంటే అప్పుడేం చేయాలి ? ఎక్కడో ఐసొలేషన్ వార్డుల్లో వైరస్ సోకిన వారిని ఉంచి వైద్యం అందిస్తున్నపుడు ఇతర జనాలకు అది ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుందో ఎంపినే చెప్పాలి. నగరం నడిబొడ్డున పెడుతున్నారని వద్దంటున్నాడు ఎంపి. ఒకవేళ నగరం శివార్లలో పెడుతుంటే నగరానికి దూరంగా పెడితే రోగులు ఎలాగ వస్తారని అప్పుడు ఇదే ఎంపి అనేవాడే డౌటే లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: