ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు మ‌న దేశంలో కూడా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత‌లా కుత‌లం అవుతోన్న వేళం ఏం చేయాలా ? అని రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ఇక ఇప్ప‌టికే లాక్ డౌన్ అమ‌లు అవుతోంది. ప‌రిస్థితి చేయి దాట‌కుండా జ‌నాలు ఎవ్వ‌రూ రోడ్ల‌మీద‌కు రాకుండా చూస్తున్నారు. అయితే ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా అమ‌లు అయ్యేలా అక్క‌డ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. అయినా రూల్స్ అతిక్ర‌మించి ఎవ‌రైనా రోడ్ల మీద‌కు వ‌స్తే పోలీసులు చిత‌క్కొట్టుడు కొడుతున్నారు.

 

ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్‌లో సాఫ్ట్ వేర్ రంగాల‌తో పాటు అనేక వృత్తుల్లో ఉంటోన్న ఏపీ వాసులు అంతా ఇప్పుడు అక్క‌డ లాక్ డౌన్ నేప‌థ్యంలో తిరిగి ఏపీకి వ‌చ్చేస్తున్నారు. ఇక ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వాసులు కూడా ఆంధ్రాకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ టైంలో ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర ప్ర‌జ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. ప్ర‌స్తుతం వైర‌స్ తీవ్ర‌త నేప‌థ్యంలో ఎవ్వ‌రూ కూడా బ‌య‌ట‌కు రావొద్ద‌ని.. ఎక్క‌డి వారు అక్క‌డే ఉండిపోవాని సీఎం విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

 

ఇత‌ర రాష్ట్రాల నుంచి ప్ర‌జ‌లు ఒక్కాసారిగా వ‌స్తే వైర‌స్ మ‌రింత విజృంభించే ప్ర‌మాదం ఉంద‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇక ఇత‌ర ప్రాంతా నుంచి ఎవ‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చినా చెక్ పోస్టుల వ‌ద్ద ప‌రీక్ష‌లు నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇత‌ర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఎవ‌రు వ‌చ్చినా త‌ప్పనిస‌రిగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఎవ‌రైనా ఇప్పుడు ఏపీకి వ‌స్తే వాళ్లు త‌ప్ప‌నిస‌రిగా 14 రోజులు క్వారంటైన్లోనే ఉంటారు. క్లిష్ట సమయంలో పౌరులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ప్రభుత్వానికి సహకరించాల‌ని కోరింది. ఇక ఏపీలో ఇప్ప‌టికే 10 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దులు అన్నింటిని మూసివేసింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: