కొరోనా వైరస్ దెబ్బ ప్రపంచ దేశాలన్నింటినీ వణికించేస్తోంది. ఈ దెబ్బకు గల్ఫ్ దేశాలు కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచదేశాల నుండి గల్ఫ్ దేశాలకు విమానాల రాకపోకలు ఒక్కసారిగా నిలిపేయటంతో  సమస్యలు పెరిగిపోతున్నాయి. సమస్యలు ఎంత దాకా పెరిగిపోయిందంటే రోజుకు 20 మంది భారతీయులు చనిపోతున్నారట. ఇందులో కూడా విషాధం ఏమిటంటే చనిపోతున్న 20 మందిలో ఐదుగురు తెలుగు వాళ్ళే ఉండటం.

 

గల్ఫ్ దేశాల్లో కూడా ప్రధానంగా సౌదీ అరేబియా, దుబాయ్ లోనే కొరోనా వైరస్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా మనదేశంలో పై రెండు దేశాల నుండే రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల నుండి  పై రెండు దేశాలకు సుమారు లక్షమంది దాకా రాకపోకలకు సాగుతుంటాయని అంచనా. దాదాపు వారం రోజుల క్రితం  ఒక్కసారిగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేయటంతో సమస్య మొదలైంది.

 

గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు. నర్సులు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారు, చమురు ఉత్పత్తి రంగంలో పని చేస్తున్న వారు చాలా ఎక్కువ. ఎప్పుడైతే వైరస్ దెబ్బకు గల్ఫ్ దేశాల్లో పనులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయో సమస్య మొదలైంది. ఎలాగంటే పై రంగాల్లో పనిచేస్తున్న వారందరినీ ఆయా సంస్ధలు ఎవరి దేశాలకు వాళ్ళని వెళ్ళిపోమని ఆదేశించాయి. వెంటనే బయలుదేరి వచ్చిన వాళ్ళు వచ్చేశారు. విమన సర్వీసులు నిలిచపోవటంతో మిగిలిన వారు ఏమీ చేయలేక ఎక్కడివాళ్ళు అక్కడే ఆగిపోయారు.

 

ఈ సమస్య వల్లే నిలిచిపోయిన వారిలో వైరస్ సోకటంతో చాలామంది చనిపోతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రతిరోజు 20 మంది భారతీయులు చనిపోతున్నారట. వీరిలో కూడా ఐదుమంది తెలుగు వాళ్ళే ఉంటున్నారు. వీళ్ళ మృతదేహాలను ఏ విధంగా దేశానికి తీసుకురావాలో కూడా అర్ధం కావటం లేదు. విమానసర్వీసులు లేకపోవటంతో పెద్ద సమస్య అయిపోయింది. దుబాయ్, షార్జా లాంటి దేశాల్లో ప్రత్యేక అనుమతులతో మృతదేహాల ఖననానికి అనుమతులు ఇస్తున్నాయి అక్కడ ప్రభుత్వాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: