చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్..(కోవిడ్‌-19) ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ లక్షణాలు జలుబు, దగ్గుతో మొదలై తీవ్ర జ్వరం వరకు వెళుతుంది. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కోవిడ్ 19కి ఇప్పటివరకూ మందు లేదు. అయితే, వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్ర‌త్త‌లే దీనికి మందు. ప్రస్తుతం ప్రపంచంలో 418273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 108323 మంది కరోనా నుంచీ బయటపడ్డారు. మృతుల సంఖ్య 18609కి చేర‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. క‌రోనా వైర‌స్‌పై సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని నిజాలు ఉంటే.. కొన్ని అబద్ధాలు ఉంటాయి. 

 

దీంతో ప్ర‌జ‌లు ఏది న‌మ్మాలి.. ఏది న‌మ్మ‌కూడ‌దు అన్న అయోమ‌యంలో ఉంటున్నాయి. ఇక ప్ర‌స్తుతం వేడి ప్రాంతాల్లో ఉంటే కరోనా రాదు.. అనే వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా ఉండదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మ‌రియు మనదేశంలో వచ్చే రెండు నెలలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కరోనా గురించి ఆందోళన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది కేవ‌లం అపోహ మాత్రమే. సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా కరోనా వచ్చింది. 

 

అక్కడ విపరీతమైన ఎండలుంటాయి. అలాగే చైనాలోని అన్ని రకాల వాతావరణ ప్రాంతాల్లో వైరస్‌ సోకినందున వేడి వాతావరణంలో కరోనా రాదనుకోవడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వెల్లడించింది. సార్స్‌, ఇతర వైరస్‌లతో కరోనాను పోల్చకూడదని పేర్కొంది. ఇక‌ ఇండియాలో కూడా బయటి దేశాల నుంచీ వచ్చే వారికి కరోనా వస్తోంది. అలా వచ్చిన వారి నుంచీ ఇతరులకు అది వ్యాపించి.. ఇండియాలోనూ ఎండలు ఉన్నా కరోనా వ్యాధి సోకే ప్రమాదం ఉంది.  కాబట్టి మ‌నం ఎంత జ‌గ్ర‌త్త తీసుకుంటే.. అంతలా క‌రోనా వైర‌స్‌తో పొరాడ‌గ‌లం. మ‌రియు సోష‌ల్ మీడియాలో క‌రోనా వైర‌స్‌పై వ‌చ్చే ఫేక్ న్యూస్‌ల‌కు దూరంగా ఉంటే ఇంకా ఉత్త‌మం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

applehttps://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: