లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకునేలా కేంద్రం అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ వల్ల నష్టపోయే వారిని ఆదుకునేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా 80 కోట్ల మందికి సాయం అందుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 

 

అంతే కాదు.. నిరుపేదలకు 3 నెలల పాటు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా.. నష్టపోతున్న వారిని ఆదుకునేందుకు ఈ నిర్ణయాలు ప్రకటించారు. ఈ దేశంలో లాక్ డౌన్ కారణంగా ఒక్కరు కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయబోమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 

 

మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన కరోనాను అడ్డుకునేందుకు దేశం త్యాగాలు చేయక తప్పదని నిర్మలా అన్నారు. కరోనా కారణంగా అన్ని రంగాలూ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే.. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేసేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే కేంద్రం కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు, ఉపశమన చర్యల్ని ప్రకటించింది.

 

 

తాజాగా.. కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ నిర్వహించిన మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. నిజంగా ఈ చర్యలన్నీ పేదలను ఆదుకునేవే అని చెప్పాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: