ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా బూచీ విజృంభిస్తుండ‌డంతో ప్ర‌పంచ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అన్ని అత‌లా కుత‌లం అవుతున్నాయి. ఇప్ప‌టికే అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో ఉత్ప‌త్తి రంగం ఆగిపోయింది. నిర్మాణ రంగం ఊసే లేదు. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో మ‌న దేశంలో కూడా వ్య‌వ‌స్థ‌లు అన్ని కుప్ప కూలిపోయాయి. నిర్మాణ‌, ఉత్ప‌త్తి రంగాల‌కు బ్రేక్ ప‌డ‌డంతో ఉపాధి లేకుండా పోయింది. క‌రోనా పేద‌ల‌కు ఉపాధి లేకుండా చేసేసింది. రెక్కాడితే గాని డొక్కాడ‌ని పేద‌లు ఎలా భోజ‌నం చేస్తారో ? అన్న సందేహాలు అంద‌రికి ఉన్నాయి.

 

అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంది. వ‌చ్చే మూడు నెల‌ల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పేద‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండే కేంద్రం భారీ ప్యాకేజ్ ప్ర‌క‌టించింది. కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని  ప్ర‌క‌టించింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఎలా ప‌ని చేస్తున్నామో ?  వివ‌రించారు.

 

ఇక దేశ ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌ని వివ‌రించారు. దేశంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ ఒక్క‌రు ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌న్న‌దే త‌మ ధ్యేయ‌మ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఇక వ‌ల‌స కార్మికుల‌ను ఆదుకుంటాం అని చెప్పారు. ఇక పేద‌ల‌కు ఆహార భ‌ద్ర‌త కోసం కేంద్రం అదిరి పోయే ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. పేద‌ల‌కు ఆహార భ‌ద్ర‌త నేప‌థ్యంలో దేశంలో ఉన్న 80 కోట్ల మంది పేద‌ల‌కు నెలా నెలా 5 కేజీల బియ్యం లేదా గోధుమ‌లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప‌థ‌కంతో దేశంలో ఉన్న పేద‌లు అంద‌రూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటార‌న‌డంలో సందేహం లేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: