ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నారనే సమాచారం. అయితే.. ఈ ప్రెస్ మీట్ లో సీఎం జగన్ ఏం మాట్లాడబోతున్నారనే విషయం పై ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కరోనా భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటివరకు వేలల్లో కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఏపీలో కూడా ఇప్పటి వరకు పది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం సీఎం జగన్ ఈ రోజు ప్రెస్ మీట్ లో లాక్ డౌన్, కరోనాను అదుపు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారని సమాచారం.

 

మీడియా సమావేశంలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏం కీలక నిర్ణయం తీసుకుంటున్నారనేది చర్చ సాగుతుంది. రాష్ట్రంలో సీఎం తాజా పరిణామాలు, నిత్యావసర వస్తులు, కూరగాయలు, వాలంటీర్ పనుల గురించి మాట్లాడబోతున్నారని సమాచారం. అంతేకాక ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహహద్దు ఇబ్బందులు ఉంటే వాటి గురించి మాట్లాడతారనే సమాచారం. అలాగే తెలంగాణాలో కొన్ని కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ లో కొంతమంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు. వారు వారి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ.. కృష్ణా, గుంటూరు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు నిలిపివేశారు.

 

దీంతో సీఎం జగన్ ఈ విషయం పై స్పందించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారుల్ని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి. అయితే.. ఇదిలా ఉండగా కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బులిటెన్ విడుదల చేశారు.

 

అయితే కరోనాకు సంబంధించిన అనుమానాలకు 104 నెంబర్‌ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా., విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌ లో ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: