క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఇప్ప‌టికే ప్ర‌పంచ అంతా విల విల్లాడుతోంది. ఇప్ప‌టికే భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ క‌రోనాకు బ్రేకులు వేసేందుకు ఇప్ప‌టికే ఏకంగా 21 రోజుల పాటు  క‌రోనా కోసం లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ఇక ఏపీలో సైతం క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అదే టైంలో అటు తెలంగాణ‌లో క‌రోనా విజృంభిస్తుండ‌డంతో సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను నిత్యావ‌స‌రాల కొర‌త తీవ్రంగా వెంటాడుతోంది. 

 

ఈ క్ర‌మంలోనే ఏపీలో నిత్యావ‌స‌రాల కొర‌తను కంట్రోల్ చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌ను ప‌క్కనే తెలంగాణ ప్ర‌భుత్వం నిశితంగా గ‌మ‌నిస్తోంది. ఏపీలో కృత్రిమంగా ధ‌ర‌లు పెంచితే ఇప్పటికే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అలాగే ఏయే కూర‌గాయ‌ల‌ను ఏ రేట్ల‌కు అమ్మారో స్ప‌ష్టం చేశారు. అలాగే ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదుల కోసం ఇప్ప‌టికే టోల్ ఫ్రీ నెంబ‌ర్ కూడా ఏర్పాటు చేసింది. ఎక్క‌వ రేట్ల‌కు అమ్మే వ్యాపారుల‌పై కంప్లైంట్ చేసేందుకు 1092కు కాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. 

 

జ‌గ‌న్ ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని సైతం నియ‌మించారు. రవాణా ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు ధ‌ర‌ల‌ను కంట్రోల్ చేసే బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే ప‌ద్ధ‌తిని తెలంగాణ‌లో సైతం అమ‌లు చేసేందుకు సీఎం కేసీఆర్ స‌ర్కార్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ‌లో ఏపీలో కంటే లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్‌గా అమ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. దీనిని కంట్రోల్ చేసేందుకు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవ‌రైనా అధిక రేట్ల‌కు అమ్ముతున్నార‌ని తెలిస్తే వారి షాపులు సీజ్ చేసి... వారు ఎప్పుడూ వ్యాపారం చేయ‌కుండా కూడా నిషేధం విధించే ఆలోచ‌న‌లో కేసీఆర్ స‌ర్కార్ ఉంద‌ట‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: