కరోనా మహమ్మారితో దేశం మొత్తం స్తంభించిపోయింది. ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు కూడా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఎవరూ ఉద్యోగాలకు, పనులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 14వరకూ ప్రకటించిన లాక్ డౌన్ తో దేశం మొత్తం మూగబోతోంది. దీంతో దినసరి కూలీలు, పేదలు, వృద్ధులకు వితంతువులకు, దివ్యాంగులకు  కేంద్రం భారీ సాయం ప్రకటించింది. ఈ సాయాన్ని మూడు కోట్ల మందికి ఆర్ధికంగా ఊరటను ఇవ్వబోతోంది. ఇందుకు గానూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 1.70 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా వారికి ఈ సాయం అందనుంది.

 

 

దేశంలో ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, కార్మికులు. పట్టణాలు, గ్రామాల్లోని నిరుపేదల ఆసరా కోసం కేంద్రం ఈ ప్యాకేజీ రూపొందించింది. ఈ ప్యాకేజీ రెండు విధాలుగా వీరికి అందించేందుకు కేంద్రం ప్రణాళికలు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈ పథకం వర్తించనుంది. ఇప్పటికే వీరి సంక్షేమానికి ఉన్న 31వేల కోట్ల నిధి నుంచి ఈ మొత్తం వినియోగించనున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్దిదారులకు డైరక్ట్ గా ఈ పథకం అందనుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే స్వయం సహాయక బృందాలకు రుణాలను ఇవ్వనుంది. ఇందుకుగానూ ఈ పరిమితిని 10 లక్షలు వరకూ పెంచింది.

 

 

రానున్న మూడు నెలల వరకూ ఒకొక్కరికి 5కేజీల బియ్యం, కిలో పప్పు, పంపిణీ చేయనున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్దిదారులకు నేరుగా సాయం అందించనుంది. దీంతో దేశంలోని 63లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ది చేకూరనుంది. మొత్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు జరుగనుంది. ఉపాధిహామీ వేతనాలను కూడా రూ.182 నుంచి రూ.202 వరకూ పెంచారు. మొత్తానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పేదలకు ఉపయోగం కానుంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: