క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 21 వేల‌కు పైగా మ‌నుష్యుల‌ను బ‌లి తీసుకుంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితుల సంఖ్య 3 లక్ష‌ల‌కు చేరువ అవుతోంది. ఇక ప్ర‌పంచంలోనే ఎక్కువ జ‌నాభా ఉన్న వారిలో రెండో స్తానంలో ఉన్న మ‌న దేశాన్ని కూడా ఇప్ప‌టికే ఈ వైర‌స్ ఎటాక్ చేసింది. మ‌నం ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చుకోక‌పోతే ఇంత జ‌నాభా  దృష్ట్యా కొన్ని కోట్ల మంది ప్రాణాల‌కు ముప్పు రాక త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలోనే మ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఏకంగా మూడు వారాల పాటు దేశం అంత‌టా లాక్ డౌన్ ప్రారంభించారు. ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ ఇళ్ల‌ను విడిచి బ‌య‌ట‌కు రావొద్దని చెప్పేశారు. 

 

ఇక క‌రోనాపై యుద్ధం చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్త‌ల నుంచి సినిమా వాళ్ల నుంచి రాజ‌కీయ నేత‌లు ఇలా ప్ర‌తి ఒక్క‌రు విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌న టాలీవుడ్ సైతం క‌రోనాపై యుద్ధం ప్ర‌క‌టించింది. పలువురు తెలుగు స్టార్స్ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు విరాళాలు ప్ర‌కిస్తున్నారు. ఏ హీరో ఎంతెంత విరాళం ఇచ్చాడో ఇక్క‌డ లిస్టులో చూద్దాం.

 

- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరొక 50 లక్షలు డొనేట్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని సంక్షేమ నిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.

- ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంక్షేమ నిధికి కలిపి 70 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.

- స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇరు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి చెరో 10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

-  యంగ్ హీరో నితిన్ ఇరు తెలుగు రాష్ట్రాల సంక్షేమ నిధికి చెరో 10 లక్షలు ఇచ్చారు.

-  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ ప్రభుత్వాలకి చెరో 5 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.

 

- కమెడియన్ అలీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంక్షేమ నిధికి చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

-  మ‌రో క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇరు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి చెరో 5 లక్షలు విరాళంగా ఇచ్చారు.

- అగ్ర నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ అయిన దిల్ రాజు అధినేత తెలుగు రాష్ట్రాలకి చెరొక 10 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.

ఇక ఈ లిస్టులోకే మ‌రి కొంత మంది స్టార్ హీరోలు.. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా యాడ్ కానున్నారు. వారు కూడా త‌మ వంతుగా ఏపీ, తెలంగాణ‌కు విరాళాలు అంద‌జేయ‌నున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: