కొరోనా వైరస్ ప్రభావం ఎక్కువవుతున్న నేపధ్యంలో శుక్రవారం ఏపి క్యాబినెట్ సమావేశం జరుగుతోంది.  ప్రస్తుతం ఏపిలో 10 కేసులు నమోదయ్యాయి. రొబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే శుక్రవారం జరగబోతున్న క్యాబినెట్ సమావేశంపై అందరిలోను ఆసక్తి మొదలైంది. వైరస్ ప్రభావం పెరగకుండా ప్రభుత్వం తీసుకోగలిగిన జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటునే ఉంది.

 

కొరోనా వైరస్ బాధితులను, విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించటంలో  గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు సర్వత్రా ప్రసంసలందుకుంటున్నాయి. పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది మొత్తం విధుల్లోనే ఉన్నారు. అలాగే పెరిగే బాధితులకు సేవలు అందించటంలో భాగంగా క్వారంటైన్ సెంటర్లు, ఐసొలేషన్ వార్డుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచుతోంది. పనిలో పనిగా లాక్ డౌన్ ను చాలా గట్టిగా అమలు చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చన్న అంచనాతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపేసింది.

 

సరే ప్రస్తుత సమస్య, తీసుకుంటున్న జాగ్రత్తలు ఇలాగుంటే బడ్జెట్ మరో సమస్యగా మారింది. ఈనెల 31వ తేదీలోగా బడ్జెట్ ను పాస్ చేయించుకునేందుకని ఏకంగా ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ ను పాస్ చేయించాకోవాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశాడు. అందుకనే ముందుగా క్యాబినెట్ సమావేశంలో  ఆమోదం తీసుకోవాలి. అందుకనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ లో భాగంగానే మామూలుగా సమావేశం జరిగే ముఖ్యమంత్రి కాన్ఫరెన్సు గదిలో కాకుండా పై అంతస్తులోని విశాలమైన గదిలో సమావేశం ఏర్పాటు చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

 

మొత్తం మీద కొరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం  అట్టుడికిపోతున్న నేపధ్యంలో క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. అందుకనే జగన్ ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకుంటారేమో అని జనాలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అర్హులైన పేదలకు 25 కిలోల బియ్యం, వెయ్యి రూపాయలతో పాటు కిలో కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి నిర్ణయాలే ఇంకా ఏవైనా తీసుకుంటుందా అని అందరూ ఎదరు చూస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: