వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన శాస‌న మండ‌లి ర‌ద్దు అంశం ఇప్ప‌ట్లో ముడి ప‌డేలా క‌నిపించ‌డం లేదు. నిజానికి మండ‌లి ర‌ద్దు అనేది జ‌గ‌న్ చాలా తీవ్రంగా ప‌రిగ‌ణించారు. త‌న ప్ర‌భుత్వం భారీ మెజారిటీతో ఏర్ప‌డింద‌ని, అలాంటి ప్ర‌భు త్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌తిప‌క్షం టీడీపీ ఉద్దేశ పూర్వ‌కంగా మండ‌లిలో తిప్పికొట్టి ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతోంద ని జ‌గ‌న్ భావించారు. ఈ క్ర‌మంలో అలాంటి మండ‌లి ఉంటే ఎంత‌? అంటూ.. టీడీపీ పీచ‌మ‌ణ‌చాల‌నే ఉద్దేశంతో మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. అసెంబ్లీలో తీర్మానించారు. అయితే, ఇది ఇక్క‌డితో అయిపోలేదు. పార్ల‌మెంటులో ఈ బిల్లు పాసైతే..నే ఏపీలో మండ‌లి ర‌ద్ద‌వుతుంది.

 

అయితే, కేంద్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, ప్ర‌భుత్వంలో కీల‌కంగా వారికి మంచి యాక్స‌స్ ఉంది. ఈ నేప‌త్యంలో కేంద్రం త‌న మాట వింటుంద‌ని, మండ‌లి ర‌ద్దవుతుంద‌ని, టీడీపీకి నామ రూపాలు లేకుండా పోతాయ‌ని జ‌గ‌న్ భావించారు. నిన్న‌టి తో ముగిసిన పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఈ త‌ర‌హా నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని జ‌గ‌న్ అండ్ కో భావించారు. వాస్త‌వానికి కేంద్రం కూడా ఈ విష‌యంలో సానుకూలంగానే ఉన్నద‌నే వార్త‌లు వ‌చ్చాయి. 

 

జ‌గ‌న్ ఎలాగూ కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగానే వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న అభీష్టం మేరకు కేంద్రం పార్ల‌మెంటులో మండ‌లిని ర‌ద్దు చేయ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే, ఈ లోగా నంబ‌రు చివ‌రి నుంచి క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెరిగింది. దీంతో దేశం మొత్తం దృష్టి దీనిపైనే ప‌డింది. ఇక‌, కేంద్రం కూడా హుఠాహుఠిన ఈ చ‌ర్య‌ల్లో మునిగిపోయింది. దీంతో పార్లమెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌ను అర్ధంత‌రంగా ముగించాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా జ‌గ‌న్ పెట్టుకున్న ఆశ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. మ‌ళ్లీ పార్ల‌మెంటు స‌మావేశాలు ఆగ‌స్టు చివ‌రి వారంలో కానీ, సెప్టెంబ‌రులో కానీ జ‌రుగుతాయి. 

 

అప్ప‌టి త‌ర్వాత ప‌రిస్థితి ఏంట‌నేది ఎలా ఉన్నా.. ఇప్ప‌టికైతే.. జ‌గ‌న్‌కు ఊర‌ట ల‌భించ‌లేదు. ఇదిలావుంటే, కేంద్ర పెద్ద‌లు ప్ర‌స్తుతానికి చూసి చూడ‌న‌ట్టు పోవాల‌ని, త‌ద్వారా మీకే ల‌బ్ధి చేకూరుతుంద‌ని జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. వ‌చ్చే 2021 నాటికి టీడీపీ స‌భ్యుల కాల‌పరిమితి తీరుతుంది క‌నుక మీరు మండ‌లిలో బ‌లం పెంచుకోవ‌చ్చ‌ని  సూచించార‌ట‌. దీంతో జ‌గ‌న్ ఇప్పుడు కిం క‌ర్త‌వ్యం అంటూ త‌ల ప‌ట్టుకున్నార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: