కరోనా వ్యాధి దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది . అయితే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది . ఢిల్లీ లో ఒక మహిళ  వల్ల దాదాపు 900 మంది కి కరోనా పాజిటివ్ గా తేలింది . ఓ  మహిళ వల్ల వైద్యునికి సంక్రమించిన కరోనా ,  చివరకు ఆయన  భార్య, బిడ్డల ను కూడా  కరోనా వ్యాధి బారిన పడేలా చేసింది . వివరాల్లోకి వెళితే ఈశాన్య ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లో వైద్యునిగా పని చేస్తోన్న వ్యక్తిని ఇటీవల ఒక మహిళ కలిసింది . సదరు మహిళ కరోనా పాజిటివ్ కావడంతో ఆమె వల్ల   వైద్యుడు కరోనా వ్యాధి సోకింది . వైద్యునికి టెస్టులు చేయగా పాజిటివ్ గా అని తేలింది .

 

అయితే అంతకుముందే సదరు వైద్యుడు  , తన వద్దకు వచ్చిన వారికి వారం రోజులపాటు   వైద్య సేవలు అందించారు . కరోనా బాధితుడైన వైద్యుడు నుంచి వైద్య సేవలు పొందిన దాదాపు  900 మందికి  కరోనా    పరీక్షలు నిర్వహించగా , వారికి కూడా పాజిటివ్ అని తేలింది .దీనితో వైద్యున్ని ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు . కరోనా పాజిటివ్ వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించే సమయం లో వైద్య సిబ్బందికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ,  వారికి కూడా కరోనా వ్యాధి సంక్రమించే అవకాశాలు లేకపోలేదని వైద్య  నిపుణులు చెబుతున్నారు .

 

ఈశాన్య ఢిల్లీ లోను వైద్యుడు కూడా కరోనా పాజిటివ్ మహిళ కు చికిత్స అందించే క్రమం లో అతడికి కూడా సోకి ఉంటుందని , అయితే అతడు తనకు వ్యాధి సంక్రమించిన విషయాన్ని గుర్తించకుండా ఇతరులకు వైద్యం అందించారని పేర్కొంటున్నారు . కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించిన వైద్యులు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించుకోవడం మంచిదని  సూచిస్తున్నారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: