ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ... 21 రోజుల పాటు అందరూ ఇంట్లోనే కూర్చోవాలని పదే పదే చెప్పారు కానీ రోడ్ల మీద బతికే లక్షల మంది ఎక్కడ ఉండాలో చెప్పలేదు. అప్పుడే కాదు అస్సలు ఇంతవరకు వారి గురించి పట్టించుకున్న నాథుడే లేడంటే నమ్మండి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా మోడీ చెప్పిన మాటలనే చిలకపలుకులు పలికాడు.




ఐతే పోలీసులు... ఇళ్ళకి పరిమితమవ్వకుండా బయట వీధుల్లో కనిపించిన ప్రతి ఒక్కరిని విపరీతంగా కొడుతున్నారు. ముఖ్యంగా పేద వారిని టార్గెట్ చేస్తున్నారు పోలీసులు. మార్చి 21 తెల్లవారుజామున మహారాష్ట్ర లో ధన్సింగ్ కాలే కుటుంబ సభ్యులు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నప్పుడు విల్లే పరేల్ పోలీస్ స్టేషన్ సిబ్బింది వారిని కిరాతకంగా కొట్టారు. వీరి దాడిలో ఆ కుటుంబ సభ్యుల చేతులు కూడా విరిగిపోయాయి. ఆపండి సార్ అని కాళ్లావేళ్లా పడినా పోలీసులు మాత్రం ఆ వీధిని ఖాళీ చేయాలంటూ మగవారితో సహా ఆడవారిని కూడా కొట్టారు.




ఆ పోలీసులు దాడి తరువాత తీవ్రగాయాలైన బాధితులు సిటీ వదిలి వెళ్లిపోయారు. అచ్చం ఇలాంటి సంఘటనలే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతున్నాయి. ఫుట్ పాత్ పై బ్రతికే వారికి కరోనా వైరస్ గురించి కానీ లాక్ డౌన్ గురించి కానీ తెలియదు. అటువంటి వారి కోసం ప్రభుత్వాలు ఒక్కసారైనా ఆలోచించి ప్రత్యేక ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారిని అక్కడి తరలించాలి. ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగానే ఉంటున్నాయి. వాటిల్లో వీరికి ఆశ్రమం కలిపించి ఉచితంగా ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: