కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిందన్న సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ వైరస్ ఎలా పుట్టిందన్న విషయంపై ఇప్పటికే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని చైనా కావాలనే సృష్టించిందని.. ఇతర దేశాలపై ప్రయోగం కోసం తయారు చేసే క్రమంలో అది దారి తప్పిందన్న ప్రచారం కూడా సాగింది. అయితే కరోనా ప్రభావం చైనా పై కూడా చాలా ఎక్కువగానే ఉంది.

 

 

కరోనా వైరస్ కారణంగా చైనాలో 3,200మందికి పైగా మరణించారు. 82వేల పాజిటివ్ కేసులు ఇంకా చైనాలో ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన చైనా.. కరోనా వైరస్‌ను చైనా తయారు చేయడంగానీ, ఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేయలేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ను కొందరు చైనీస్‌ వైరస్ , వుహాన్‌ వైరస్‌ గా పిలవడాన్ని ఆ దేశం తప్పుబట్టింది.

 

 

కావాలనే కొందర చైనాను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం మాని.. కరోనాను ఎదుర్కోవడంలో చైనా స్పందించిన తీరును ప్రపంచం గమనించాలన్నారు. అంతే కాదు.. అసలు కరోనా పుట్టుకపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది. వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ బయటపడినప్పటికీ దీని మూలాలు చైనాలోనే ఉన్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని వాదిస్తోంది.

 

 

కరోనా వైరస్ సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇది పుట్టిందని చైనా చెబుతోంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనను ఆ దేశం గుర్తు చేస్తోంది. కానీ చైనా వాదనను మిగిలిన ప్రపంచం నమ్మడం లేదు. ముఖ్యంగా అమెరికా అయితే చైనా తీరుపై మండిపడుతోంది. న్యాయవాది ఏకంగా చైనాపై కోట్ల డాలర్ల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కారు కూడా.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple   : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: