చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ పుట్టిల్లును వదిలి ఇప్పుడు ప్రపంచం అంత తిరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాపించి ఎందరో ప్రాణాలను తీస్తుంది. ఇంకా ఆ దేశాలు అన్ని కూడా కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేశారు. ఇంకా ఇటలీలో అయితే ఎందరో ప్రజలు మృతి చెందారు.

 

ఇటలీలో మృతి చెందిన వారి సేవలను పూడ్చడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు.. అలాంటి స్థితిలో ఉంది ఆ దేశం. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ప్రపంచంలో ఏ స్టేజిలో ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..  కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4లక్షల 86వేల 702మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.. 

 

అందులో 22.201 మంది కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు.. లక్ష 17 వేల మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. మన భారత్ లో ఇప్పటివరకు 694 కరోనా కేసులు పాజిటివ్ వచ్చాయి.. అందులో 14 మంది మృతి చెందారు.. 45 మంది వైరస్ నుండి బయటపడ్డారు. ఇంకా యునైటెడ్ స్టేట్స్ లో అయితే ఏకంగా 68 వేల 581 మందికిపైగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అందులో వెయ్యిమంది మృతి చెందారు. 

 

ఇంకా ఇటలీలో అయితే ఏకంగా 74 వేలమందికిపైగా కరోనా వైరస్ వచ్చింది. దీంతో అక్కడ ఏడు వేలమందికిపైగా మృతి చెందారు. ఇంకా 9 వేలమంది ఈ కరొనా వైరస్ బారి నుండి పడ్డారు. ఇంకా అన్నటికంటే ముఖ్యంగా కరోనా పుట్టిళ్లును పూర్తిగా మర్చిపోయింది. 84వేలమందికి ఈ కరోనా వైరస్ సోకగా అందులో కేవలం అంటే కేవలం 3 వేలమంది మాత్రమే ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇంకా ఈ కరోనా బారి నుండి 74వేలమంది బయటపడ్డారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: