కరోనా వైరస్ ని తయారు చేసారా...? అసలు దాని అంతట అదే పుట్టిందా అనేది చాలా మందికి అర్ధం కావడం లేదు. వైద్యులు కూడా ఈ విషయంలో ఏ అంగీకారానికి కూడా రాలేకపోతున్నారు. ఇది ఏ విధంగా పుట్టింది అనే దాని మీద ప్రపంచ దేశాలు అన్నీ కూడా పరిశోధనలు చేస్తూనే ఉన్నా అసలు విషయం మాత్రం బయటకు రావడం లేదు. కరోనా వైరస్ అనేది ఒక ప్రళయం అనే వాళ్ళు ఉన్నారు గాని ఆ ప్రళయం ఏ విధంగా పుట్టింది అని చెప్పే వాళ్ళు మాత్రం దాదాపుగా ఎక్కడా కనపడటం లేదు. అది ఎలా వచ్చింది అనే దాని మీద కనీస అవగాహన ఎవరికి లేదు అనేది వాస్తవం. 

 

ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో కొన్ని విషయాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ అనేది ఎక్కడ పడితే అక్కడ గుర్తించేది కాదు. దేశ వ్యాప్తంగా దాని ల్యాబ్ లు తక్కువ. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా దాని ల్యాబ్ లు అనేవి లేవు అనే మాట వాస్తవం. ఇక అభివృద్ధి చెందని ఆఫ్రికా దేశాలు అయితే కరోనా ల్యాబ్ లు లేక ఇతర దేశాలకు నమూనాలను పంపి అక్కడ నిర్ధారణ చేయిస్తున్నారు అనేది వాస్తవం. చాలా దేశాలు ఇలాగే ఉన్నాయి. మన దేశంలో అయితే ముందు పూణే లో మినహా ఎక్కడా కూడా కరోనా వైరస్ ల్యాబ్ అనేది లేదు. 

 

దీనితో తెలంగాణా సహా అనేక రాష్ట్రాలు పరిక్షల కోసం పూణే పంపాయి. ఇక మరో విషయం ఏంటీ అంటే కరోనా వైరస్ ని వేగంగా గుర్తించలేకుండా రెండు వారాలకు గాని అది బయట పడే విధంగా తయారు చేసారని వ్యాపించే వేగం కూడా ఎవరికి తెలియకుండా ఉందని తయారు చేసారని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: