కరోనా... కరోనా... ప్రపంచంలో ఎక్కడ చూసిన ఇది తప్ప వేరే టాపిక్ లేదంటే నమ్మండి. ఎందుకంటే అందరికి తెలిసినదే. ప్రపంచం మొత్తంలో ఇది ఎంత ప్రభావం చూపుతుందో. చైనా దేశంలో మొదలైన ఈ మహమ్మారి రెండు నెలల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికీ వ్యాపించింది. అది ఎంతలా ప్రభావం చూపుతుందంటే ఏకంగా దేశం మొత్తం లాక్ డౌన్ అయ్యేంత పరిస్థికి చేరుకుంది. ఇంకా అలాగే దీని ప్రభావం అరబ్ దేశాలలో, యూరప్ దేశాలలో మరి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్ దేశాలలో మారణకాండ కొనసాగుతుంది. దీనితో  ఆ దేశాలలో ప్రభుత్వాలు చేతులు ఎత్తి వేసే పరిస్థితులలో ఉంది.

 

 


ఇక అసలు విషయానికి వస్తే నేటికి మనదేశంలో మీడియా ద్వారా అందుతున్న సమాచారం వరకూ 649 మందికి పాజిటివ్ రిపోర్ట్ రాగా, అందులో 13 మంది మరణించారు. భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్రలో ఏకంగా వందకు పైగా కేసులు పాజిటివ్ గా వచ్చాయి. దీన్ని బట్టే చెప్పవొచ్చు రాబోయే రోజులలో దేశంలో పరిస్థితి ఎలా ఉండబోతుందో. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ని దేశమంతటా ప్రకటించారు. 

 

 


మోడీ మంచి మన కోసం, మన ఆరోగ్యం కోసం లాక్ డౌన్ ని ప్రకటించినా దేశంలో చాలా మంది ఆ విషయాన్నీ పట్టించుకోకుండా వారి ఇష్టానుసారం వారు గడుపుతున్నారు. ముఖ్యంగా గుంపులు గుంపులుగా ఉండకూదదు అంటే ఒకరి మీద ఒకరు పడుతూ బయట తిరుగుతున్నారు. దేశంలో గత 24 గంటల్లో నలుగురు మృతి చెందగా, 43 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాబట్టి ఎవరికివారు ఇంట్లో ఉంది జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: