ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను సంతోషంగా ఉంచడానికి రేయింబవళ్లు కష్టపడుతుంటారు. పిల్లలు పుట్టిన దగ్గరనుండి ప్రతి పైసా వారికోసమే సంపాదిస్తుంటారు తల్లిదండ్రులు. వారికి కావాల్సినవన్నీ కొనిచ్చి సంతోషపరుస్తుంటారు. ఐతే ఇవ్వన్నీ మీ పిల్లలను కొంతవరకు సంతోషపరుస్తాయే కానీ పూర్తిగా వారిలో ఆనందాన్ని నింపలేవు. అయితే పూర్తి స్థాయిలో వారికి ఆనందాన్ని కలిగించేది ఏమిటని ప్రశ్నిస్తే... అది తల్లిదండ్రులు పంచె ప్రేమేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.



మీరు మీ పిల్లలకు ప్రేమని చూపించకుండా వారితో దూరంగా ఉంటూ వారికి ఎన్ని డబ్బులు ఇచ్చినా అవి సంతోషాన్ని మాత్రం కలిగించలేవు. జగమెరిగిన సత్యం ఏమిటంటే... ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా కేవలం మనుషుల ప్రేమ మాత్రమే అందరినీ సంతోషపరుస్తుంది. ఇది పిల్లలకు కూడా వర్తిస్తుంది. అందుకే మీ పిల్లలు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పెరిగేందుకు మీరు వారిపై ఎంతో ఆప్యాయతను ప్రేమను చూపాలి. అలాగే వారికి పది ఏళ్ళు వచ్చేవరకు నుదిటిపై ముద్దులు పెడుతూ, కౌగిలింతలు ఇవ్వొచ్చు. మీ పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారిని దగ్గరకు తీసుకుని చాలా ఆప్యాయంగా పొగుడుతూ హత్తుకోండి. ఇలా చేయడం వలన వారు మంచి పనులు ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వారి మానసిక ఆరోగ్యం దృఢపడుతుంది.




మీరు మీ పిల్లలను తరచుగా కౌగలించుకోవడం వలన వారిలో ఎదుగులతో పాటు వారికి మీతో బలమైన బంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా అమ్మ కౌగలించుకుంటే పిల్లలో కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేం. ఇందుకు కారణం హాగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే ఓ హార్మోన్ విడుదలవడమే. ఈ హార్మోన్ బాడీ లో రిలీజ్ అవ్వడం వలన ఆటోమేటిక్ గా మనకి సంతోషం కలుగుతుంది. అందుకే ఈ హార్మోన్ ని హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. మీ పిల్లల్ని 20 సెకండ్ల పాటు ఆప్యాయంగా హాగ్ చేసుకుంటే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే వారిని తరచుగా కౌగలించుకుని వారిని మానసికంగా, శారీరకంగా ఎదగనివ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: