దేశంలో కరోనా వైరస్ వేగం తగ్గింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 681 కి చేరుకుంది. 24 గంటలలో నలుగురు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా మారింది అంటున్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గడం మంచి పరిణామం అంటున్నారు. కరోనా కేసులు గత 24 గంటల్లో 43 ,మందికి కరోనా సోకింది. అయితే కరోనా తీవ్రత చాలా వరకు తగ్గింది అని చెప్తున్నారు. ఊహించని విధంగా నమోదు అవుతుందని భావించిన కరోనా వైరస్ ఇప్పుడు క్రమంగా తగ్గడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

కేంద్రం కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ముందు కరోనా వైరస్ ని కట్టడి చేయడం కష్టం అనుకున్న కేంద్రం లాక్ డౌన్ ని ప్రకటించిన తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది అని భావిస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు కర్ణాటక లో 10 కేసులు నమోదు అయ్యాయి ఒక్క రోజులో. ముగ్గురు ఆ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర లో కూడా అలాగే పరిస్థితి ఉందని అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో తగ్గినట్టే తగ్గి పెరిగాయి కేసులు. 

 

తెలంగాణాలో వైద్యులకు కరోనా రావడం తో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 44 కి చేరుకుంది. అయితే లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తే మాత్రం అది తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాని గురించి ఆందోళన అవసరం లేదని చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటే అది కట్టడి కావడం పెద్ద విషయం కాదని అనే వాళ్ళు ఉన్నారు. కాని మన దేశంలో మాత్రం అది కట్టడి అవ్వాలి అంటే జనాలు మాట వినాల్సిందే.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: