దేశదేశాలు కరోనా వల్ల అల్లాడి పోతుంటే పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని మరోసారి ప్రదర్శిస్తుంది.. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్ద పూర్తిగా నాశనమై ఆ దేశం ప్రమాదంలో పడిన వేళ కనీసం సిగ్గు, శరం తెచ్చుకోనైన ఉగ్రవాదాన్ని వీడి, పక్కనున్న దేశాలతో ఐక్యతగా ఉంటూ ఇప్పుడున్న ప్రమాదం నుండి గట్టెక్కాలనే ఆలోచన కూడా లేకుండా ఎప్పుడు భరత భూమిని అంతం చేద్దామా అనే దాహాంతో ఎదురు చూస్తూ ఉంటుందనుకుంటా.. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల రానున్న రోజుల్లో ఏ దేశాల్లో ఎంత మంది ప్రజలు బ్రతుకుతారో తెలియని దుస్దితి నెలకొంటుంది..

 

 

ఒక వేళ కరోనా కనుక కంట్రోల్ కాకుంటే జరిగే దారుణాలు ఇప్పటికే ఇటలీ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పంజాబ్ ప్రావిన్స్‌లోని కోవిడ్ పేషెంట్లను పాకిస్థాన్ ఆర్మీ బలవంతంగా పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బల్టిస్థాన్‌కు పంపిస్తోంది. పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో కోవిడ్-19 పేషెంట్లు లేకుండా చూడటం కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మిర్పూర్, ఇతర ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారని సమాచారం. ఇదివరకే ఆర్మీ కేంద్రాలు, సైనికుల కుటుంబాలకు సమీపంలో ఒక్క కరోనా పేషెంట్ కూడా ఉండొద్దని ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో భారీ సంఖ్యలో కరోనా పేషెంట్లను లాక్ చేసిన రవాణా వాహనాల్లో మిర్పూర్ సిటీతోపాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 

 

అసలే పీవోకేలో వైద్య సదుపాయాలతో పాటుగా, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా సరిపడా లేరు. ఇలాంటి సమయంలో తమ ప్రాంతంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల, స్థానిక కశ్మీరీ ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని పీవోకే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే పాకిస్థాన్‌లో ప్రభుత్వ వైఫల్యం ఉండటం వల్ల, దేశం మొత్తాన్ని ఆర్మీకి అప్పగించడంతో, ఆర్మీ తన ప్రయోజనాలకు అనుగుణం వ్యవహరిస్తోంది.. కాగా ఇప్పటి వరకూ పాకిస్థాన్‌‌‌లో 1000 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఒక్క సింధు ప్రావిన్స్‌లోనే 400, పంజాబ్ ప్రావిన్స్‌లో 300 కరోనా కేసులు నమోదయ్యాయి... 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: