బయట రాష్ట్రాల నుండి ఒక్కరిని కూడా ఏపి లోపలకు రానిచ్చేది లేదని డీజీపి గౌతమ్ సవాంగ్ స్పష్టంగా ప్రకటించేశాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే సవాంగ్ ఇంత కఠినంగా ప్రకటన ఎందుకు చేయాల్సొచ్చింది ? ఎందుకంటే బుధవారం ఏపి-తెలంగాణా సరిహద్దులోని జగ్గయ్యపేట చెక్ పోస్టు దగ్గర జరిగిన వ్యవహారం వల్లే. తెలంగాణా నుండి సొంతూర్లకు వెళుతున్నామంటే పోలోమంటూ వేలాది మంది ఒక్కసారిగి ఏపిలోకి వచ్చేస్తామంటే ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని అనుకున్నారో అర్ధం కావటం లేదు.

 

చెక్ పోస్టు దగ్గర గుమిగూడిన వేలాదిమందిలో పదుల సంఖ్యలో కొరోనా వైరస్ ఉన్నా వెంటనే వేలాదిమందికి వచ్చేయటం ఖాయం. వైరస్ అంటించుకున్న వేలాదిమంది ఒక్కసారిగా రాష్ట్రంలోకి వచ్చేస్తే అప్పుడు పరిస్ధితి  ఎలా మారిపోతుందో ఎవరైనా ఊహించగలరా ? ఇపుడు రాష్ట్రం మొత్తం మీద 10 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అవికూడా విదేశాల నుండి వచ్చిన వాళ్ళలో బయటపడ్డవి మాత్రమే. అంటే వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎంత గట్టిగా చర్యలు తీసుకుంటోందో అర్ధమవ్వటం లేదా ?

 

అలాంటిది ఒక్కసారిగా ఏపిలోకి వచ్చేయాలని వేలాది మంది అనుకోవటమే తప్పు.  ఒకవైపు వీళ్ళు తప్పులు చేస్తున్నారని తెలిసీ ప్రధానప్రతిపక్షమైన టిడిపి నేతలు నారాలోకేష్, ఎంపి కేశినేని నాని  వాళ్ళకు వత్తాసు పలకటమే విచిత్రంగా ఉంది. సరే కొన్ని గంటల పాటు జరిగిన గొడవ తర్వాత వేరేదారి లేకే చివరకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ అనుమతించాల్సొచ్చింది. అందుకనే డీజీపి గౌతమ్ సవాంగ్ కఠినంగా వార్నింగు ఇవ్వాల్సొచ్చింది.

 

డీజీపీ వార్నింగ్ పైనే ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. తెలంగాణా నుండి ఏపిలోకి ఎవరినీ రానిచ్చేది లేదని అన్నపుడు విదేశాల నుండి అందరినీ ఎందుకు పిలిపించారంటూ అడగటమే నాని మానస్ధితికి అద్దం పడుతోంది. విదేశాల నుండి అక్కడి ప్రభుత్వాలు మనవాళ్ళని  తరిమేస్తున్నాయి కాబట్టి వెంటనే వచ్చేయమని ప్రభుత్వం పిలుపిచ్చింది. అంతేకానీ వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుని వైరస్ ను అందరికీ అంటించమని చెప్పలేదు. ఈమాత్రం కూడా అర్ధం చేసుకోలేని వాళ్ళు కాబట్టి వాళ్ళని టిడిపి నేతలంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: