కరోనాతో ఇప్పటికే ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మహమ్మారి ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. అందర్నీ హింసిస్తూ బాధిస్తోంది. కరోనా వైరస్ గురించి ఎన్ని ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నా ఏదో ఒకటి తలెత్తుతూనే ఉంది. ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడం ఎంతో ప్రమాదంగా మారిపోయిన దుస్థితి.
 
 
 
రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా బాధితుల సంఖ్య. అయితే ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసినదే. ప్రజలు ఇబ్బంది పడకూడదని ఇళ్లల్లోనే ఉండమన్నారు. అయితే మరో కొత్త సవాల్ ఎదురు అయ్యింది ఏపీ ప్రభుత్వానికి.
 
 
 
కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలంలోని ఆటపాక గ్రామంలో ఉన్న చైతన్య స్కూల్లో ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ అది అక్కడ పెడితే వారికి ప్రమాదం అని ఆ గ్రామస్తులు క్వారంటైన్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. దానిని తక్షణమే నిలిపి వేయాలని అన్నారు గ్రామస్తులు. వారు సృష్టించిన భీభత్సానికి అధికారులే ఖంగుతిన్నారు.
 
 
అయితే ఇది నిజంగా దారుణం. ఇలా వీరు చేసినట్టే ప్రతీ గ్రామంలో వారు కూడా చేస్తే నిజంగా ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఇంకేం ఉంది చివరికి క్వారంటైన్ తొలగిస్తాం అని చెప్పారు. అప్పుడు కానీ గ్రామస్తులు శాంతించలేదు.
 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: