ప్రతి చిన్న విషయానికి చైనా పైనే ఆధారపడితే పరిస్దితి ఇలాగే ఉంటుందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రపంచ దేశాలు. ప్రతి చిన్న విషయానికి డ్రాగన్ దేశంపైనే ఆధారపడితే ఏమవుతుందనేందుకు తాజా పరిస్దితే ఉదాహరణ. యూరప్ లోని చాలా దేశాలతో పాటు అగ్రరాజ్యమైన అమెరికా, భారత్ లాంటి చాలా ఏషియా దేశాలు నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకూ ప్రతిదానికి చైనానే దిక్కు. కొరోనా వైరస్ కారణంగా చైనాలో దాదాపు మూడు నెలలుగా లాక్ డౌన్ పరిస్దితిలు ఉండటంతో ప్రపంచదేశాలు సమస్యల్లోకి కూరుకుపోయాయి.

 

ఇక్కడ విషయం ఏమిటంలే గుండుసూది నుండి బోయింగ్ విమానాల తయారీ విడి భాగాల వరకూ ప్రపంచంలోని చాలా దేశాలు  చైనా తయారీ వస్తువులనే వాడుతున్నాయి. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంతో పాటు వైద్య రంగంలోని అత్యవసర పరికరాలను చైనా ఎగుమతి చేస్తేనే మిగిలిన దేశాలు వాడుకుంటున్నాయి. ప్రపంచంలోని ఇటలీ, అమెరికా, స్పెయిన్, ఇరాన్, ఫ్రాన్స్, భారత్ లాంటి చాలా దేశాల్లో కొరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పరిస్ధితి చేయి దాటిపోతోందని అర్ధమవుతున్నా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు ?

 

ఎందుకంటే వైద్యరంగంలో ఉపయోగించే అత్యవసర పరికరాలను కూడా చైనానే ఉత్పత్తి చేస్తోంది. చైనా ఉత్పత్తి చేస్తేనే మిగిలిన దేశాలకు ఎగుమవతవుతాయి. వైద్య పరికరాలంటే  ఆక్సిజన్ సిలిండర్లు, సిరింజీలు, మందులు, వెంటిలేటర్లు, మాస్కులు, బెడ్లు సమస్తం చైనా నుండే తెప్పించుకుంటున్నాయి. ఎప్పుడైతే వైరస్ కారణంతో చైనాలో పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపేశాయో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.  అమెరికాలో  కొరోనా వైరస్ ప్రభావం పెరిగిపోవటానికి ఇది కూడా ఓ కారణమే.

 

అమెరికా లాంటి దేశమే కొరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే ఇక మనదేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కొరొనా వైరస్ ను ఓ గుణపాఠంగా తీసుకోవాలి. ప్రతి వస్తువుకు చైనా మీదే ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: