కరోనా వైరస్ అభివృద్ధి చెందిన దేశాలలో గజ గజ లాడిస్తోంది. వైరస్ ని ఎదుర్కొనలేక ధనవంతుల దేశాలు తల్లడిల్లి పోతున్నాయి. చాలావరకు వైరస్ ఎక్కువగా ఉన్న దేశాలలో షట్ డౌన్ ప్రకటించడం జరిగింది. అమెరికా మరియు ఇటలీ అదేవిధంగా స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా స్పెయిన్ అయితే త్వరలో మరో ఇటలీ గా మారే అవకాశాలు ఉన్నట్లు చాలా స్పష్టంగా కనబడుతోంది. అవన్నీ మొత్తం చల్ల ప్రాంతాలు కలిగిన దేశాలు కావడంతో వైరస్ విజృంభిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ వైరస్ ని అరికట్టడానికి భారత్ 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

 

ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రాకూడదని చెప్పటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో కరోనా పాట వైరల్ గా మారింది. ప్రజలలో అవగాహన కల్పించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనతోపాటు మన కుటుంబ సభ్యులను కూడా బ్రతికించుకో గలుగుతాం అన్న రీతిలో వివరంగా ఈ విధంగా తెలియజేశారు.

 

చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా... ప్రజలందరి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయిరా బాధ్యతగా నడుచుకో నువ్వే భగవంతుడివిరా...యుద్ధానికి సిద్ధమా రోగం తరిమేద్ధమా ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలు రా... కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా కాలం మారేదాక ఓపికైతే పట్టారా...నీకోసం నాకోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనుకల్లే సాగినారు...ప్రాణాలు పనం పెట్టి మన కోసం పొరుతుంటే బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా..అరే లోకమంటే వేరు కాదు నువ్వే ఆ లోకంరా నీ బతుకు చల్లగుంటే లోకానికి సలవురా... అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలా మంది ఈ పాట నెటిజన్లు విని  అదిరిపోయింది గా అంటూ కామెంట్ పెడుతున్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple



మరింత సమాచారం తెలుసుకోండి: