తెలుగుదేశం పార్టీకి సినీ వాసనలు పోవు. ఆ పార్టీ పుట్టుకే మహానుభావుడు నందమూరి తారకరామారావు చేతుల మీదుగా జరిగింది. తరువాత నాయకత్వం చంద్రబాబు చేతుల్లోకి వచ్చినా కూడా ఎందరో సినిమా వారు ఆ పార్టీ నుంచి ఎదిగారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు. ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ ఇపుడు గతంలో ఎన్నడూ లేని కష్టాల్లో ఉంది.

 

పార్టీ పుట్టి బుద్దెరిగి ఇప్పటికి ఇలాంటి కష్టాన్ని చూసి ఎరగదు. టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకుంది. ఆ పార్టీ కోలుకోవడం కష్టమన్న భావనలో పార్టీలోని తమ్ముళ్ళే పూర్తిగా  ఉన్నారు. నిజానికి కరోనా వైరస్ ఎంటర్ కాకపోయినట్లదితే ఏపీ రాజకీయాలు ఈ పాటికి వేడెక్కి ఉండేవి. మొత్తానికి మొత్తంగా టీడీపీ నుంచి నాయకులు వైసీపీలోకి వెళ్ళిపోయేవారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ బాగుండాలని కోరుకునే అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీయార్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని అనుకుంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీయార్ వస్తాడా అంటే ఇప్పట్లో రాడు అన్న దానికి బలమైన సంకేతాలు ఉన్నాయని అంటున్నారు.

 

జూనియర్ ఎన్టీయార్ తన తండ్రి  హరిక్రిష్ణ పేరిట ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దాని మీదనే సినిమాలు వరసగా తీయాలనుకుంటున్నారు. అంటే జూనియర్ రాబోయే కాలమంతా సినీ రంగంలో ఫుల్ బిజీగా మారనున్నారని అంటున్నారు.

 

అందువల్ల ఆయన ఆశలేవీ అభిమానులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పకనే చెప్పేసినట్లైంది. ఇక జూనియర్ని కాకుండా తన కొడుకు లోకేష్ ని బాబు ప్రమోట్ చేయడం వల్ల కూడా నందమూరి వారి మనవడు సినిమా రంగమే బెస్ట్ అనుకుంటున్నాడని అంటున్నారు. ఇక జూనియర్ మరో రెండు ఎన్నికలు అంటే 2029 వరకూ రాజకీయాల వైపు చూపు చూడరని కూడా వినిపిస్తోంది.

 

అంటే కచ్చితంగా పదేళ్ళకు పైగా బలమైన ఫ్లాట్ ఫారం సినిమా రంగంలోనే వేసుకుంటూ జూనియర్ అక్కడే బిజీగా ఉంటారన్న మాట.   ఇక 2029 నాటికి జూనియర్ 47 ఏళ్ళ వాడు అవుతాడు. అది రాజకీయాలకు  తగిన సమయం అని భావిస్తే అపుడు రావ‌చ్చేమో. మొత్తానికి చూసుకుంటే 2024 ఎన్నికల్లో జగన్ తో చంద్రబాబే మళ్ళీ పోరాడాల్సి ఉంటుందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: