క‌రోనాతో  క‌ల‌వ‌ర‌ప‌డుతున్న ప్ర‌తిఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. స్వియ‌శుభ్ర‌త కూడా చాలా జాగ్ర‌త్త‌తో వ‌హిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో జాగ్ర‌త్త‌గా ఇంట్లో ఉండ‌టం వ‌ర‌కు మాత్ర‌మే బాధ్య‌త అనుకోకుండా వారి ఇంటి శుభ్ర‌త‌, వారి శ‌రీర‌శుభ్ర‌త‌ను కూడా చాలా జాగ్ర‌త్త‌గా పాటిస్తున్నారు. ఇక కుటుంబంలోని భార్యా భ‌ర్త‌లైనా స‌రే ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప‌నిలో వారు కూడా వారి సంసారానికి సైతం కొంత దూరంగా ఉంటున్నారు. ఇక ప్ర‌ధాన న‌గ‌రాలైన హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో బ్రతకాలంటే భార్యాభర్తలు తప్పని సరిగా ఉద్యోగం చేయాలి. 

 

దీంతో దంపతులు షిఫ్ట్ లు వారీగా ఉద్యోగాలు చేస్తూ ఎవ‌రి బాధ్య‌త‌ల‌ను వారు నిర్వ‌ర్తిస్తూ ఉంటారు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతా బాగున్నా.. దంపతులు మధ్య ఏదో తెలియని వెలితి. ఆ వెలితిని పూడ్చుకునేందుకు లాక్ డౌన్ తో ఒకరి గురించి ఒకరు తెలుసుకునే పనిలో పడ్డారని ఫార్మసీ, ఈ- కామర్స్ సంస్థలు చెబుతున్నాయి. లాక్ డౌన్ ప్రభావం  ఫార్మసీ, ఈ- కామర్స్ రంగాల పై కొన్ని సంస్థ‌లు స‌ర్వే చేప‌ట్టాయి.  ఏ విధ‌మైన ప్ర‌భావం చూపుతున్న‌ట్లు చేసిన స‌ర్వేలో కొన్ని విష‌యాలు తెలిశాయి. . ఆ డేటా ఆధారంగా 21 రోజుల లాక్ డౌన్ తో భార్య భర్తలు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సమయం దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 


ఇక ఈ కరోనా వైరస్ ఆందోళన కలిగించే విషయమే అయిన‌ప్ప‌టికీ ఉరుకులు పరుగులు జీవితాన్ని గడుపుతున్న ప్ర‌తి ఒక్క‌భార్యాభ‌ర్త‌ల‌కి ఇప్పుడు సమయం దొరికిందని, లాక్ డౌన్ తో నిత్యవసర సరుకులతో పాటు మెడిసిన్, కండోమ్, గర్భనిరోధక ట్యాబ్లెట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాస్క్ లతో పాటు మ‌రి కొంత మంది  క్లోరోక్విన్ మరియు ఇమ్యూనిటీ పవర్ పెంచే మెడిసిన్ ను కొనుగోలు చేస్తున్నారని, అంటే బికాంప్లెక్స్ లాంటి ట్యాబ్లెట్ల‌ను వీటితో పాటు కండోమ్ లను భారీ గా కొనుగోలు చేస్తున్నట్లు తాజాగా జ‌రిగిన స‌ర్వేలో తేలింది. భార్యా భ‌ర్త‌ల‌యిన‌ప్ప‌టికి వారికి ఎటువంటి వైర‌స్ లేక‌పోయినా స‌రే వారు ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటూ వారు సేఫ్ సెక్స్  పాటిస్తున్న‌ట్లు. ఎటువంటి సేఫ్టీ లేకుండా సెక్స్‌లో పాల్గొన‌డం లేద‌ని తెలిసింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: