కరోనా వైరస్ ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది. ఈ వైరస్ వల్ల ఇటలీ దేశంలో చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ అమెరికా మరియు స్పెయిన్ దేశాలలో చాలా ప్రమాదకరంగా మారింది. దీంతో అతి తక్కువ భూభాగం మరియు ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో ఏ మాత్రం వైరస్ చేతులు దాటితే కచ్చితంగా మరణాల సంఖ్య కొన్ని కోట్ల లో ఉంటుందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ అమలు లోకి తీసుకువచ్చింది.

 

ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితి రావడంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబ జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటువంటి నేపథ్యంలో పరిస్థితి చాలా డేంజర్ జోన్ లోకి వెళుతున్న క్రమంలో వీటిని అరికట్టేందుకు వ్యాపారాలపై పడుతున్న ప్రభావం మరియు ఖాతాదారులకు రక్షించడానికి బ్యాంకుల నుంచి సరికొత్త గుడ్ న్యూస్ వినిపించింది. అదేమిటంటే ఇటువంటి కీలకమైన ప్రమాదకరమైన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేకమైన రుణాలు అందించటానికి రెడీ అయ్యాయి.

 

ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. ప్రత్యేక అత్యవసర రుణ ఉత్పత్తుల్ని బుధవారం ఈ బ్యాంకులు ప్రకటించాయి. వీటితో పాటు కెనరా బ్యాంక్ యూకో బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లు కూడా ఖాతాదారులకు అత్యవసర రుణ సదుపాయం కల్పించబోతున్నాయి. చాలావరకు దేశంలో ఉన్న గుర్తింపు కలిగిన బ్యాంకులు ఖాతాదారులను ఆదుకోవడానికి ప్రత్యేక రుణ సహాయాన్ని అందించి వారికి భరోసా ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. కొన్ని బ్యాంకులు కూడా ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: