కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఇంటికే పరిమితం కావాలని ఎవరు కూడా బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేస్తుంది. రోజురోజుకీ వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న తరుణంలో ఇదే పరిస్థితి రాబోయే రోజులు కొనసాగితే భారతదేశం మూల్యం బాగా చెల్లించాల్సి వస్తుందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. కరుణ వైరస్ అంటే చాలా ఎటకారంగా భారతీయులు తీసుకుంటున్నారని...ఇటువంటి అత్యంత జనాభా కలిగిన దేశం లో ఏ మాత్రం వైరస్ విజృంభించిన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు శవాలుగా మారాల్సి ఉంటుందని చాలామంది చెప్పుకొస్తున్నారు.

 

ఇదిలా ఉండగా వైరస్ ప్రభావం వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడటం కోసం ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అదినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు తన వంతు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు కొటి రూపాయల చొప్పున ,ప్రధానమంత్రి సహాయ నిదికి కోటి రూపాయలు ఇస్తానని ఆయన తెలిపారు.ఎపికి ఏభై లక్షలు, తెలంగాణకు ఏభై లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిదికి ఇస్తానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో బిజెపి పార్టీకి మిత్రపక్షంగా జనసేన పార్టీ ఉండటంతో మోడీ విషయం తెలుసుకుని పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple



మరింత సమాచారం తెలుసుకోండి: