ప్రధాని మోడీ కరోనా వైరస్ ని అరికట్టడానికి తీసుకున్న 21 రోజుల పాటు లాక్ డౌన్ నిర్ణయాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. చైనాలో అత్యంత దారుణంగా విస్తరిస్తున్న తరుణంలోనే ఇతర దేశాల నుండి విమాన రాకపోకలు ఆపేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడానికి ప్రధాని తీసుకున్న నిర్ణయంపై సెండ్ చేసిన దేశ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలియజేశారు.

 

ప్రధాని మోడీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం ఒకరకంగా మంచిదే కానీ 21 రోజులు అయినది చాలా ఎక్కువ సమయం అని పేర్కొన్నారు. అసలు పరిస్థితి ఇక్కడిదాకా రావటానికి గల పరిస్థితి చాలా ముఖ్యమని అన్నారు. కరోనా వైరస్ కారణంగా చోటుచేసుకున్న పరిణామాలను అంచనా వేయటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణంగా ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఎంత తీరిక కాలంపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వేయడం వల్ల రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి పరిస్థితి వస్తుందన్నారు. అదే సమయంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరిగా లేవని దేశంలో ఉన్న పేదల గురించి పట్టించుకున్నట్లు ఎక్కడా కనబడటం లేదని పేర్కొన్నారు.

 

సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల లాక్ డౌన్ వల్ల వైరస్ నుండి తప్పించుకున్న రాబోయే రోజుల్లో ఆర్థికంగా సమస్యలు ఎక్కువ అవుతాయని ప్రశాంతి కిషోర్ నిర్మొహమాటంగా చెప్పారు. ఏంటో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు నీకున్న  గట్స్ దేశం లో ఎవ్వరికీ లేవు అంచనాలు కరెక్ట్ గా వేశావు అంటూ కితాబిస్తున్నారు. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple




 

మరింత సమాచారం తెలుసుకోండి: