కరోనా వైరస్ కట్టడి చేయటానికి దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఒకపక్క విమర్శలు వస్తుంటే మరోపక్క ఇట్లాంటి పెద్ద కంట్రీలో సరైన నిర్ణయం తీసుకున్నారు కేంద్రమని పొగుడుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కడికక్కడ సరిహద్దులు మూసివేశారు. అంతేకాకుండా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తుతో రాష్ట్రం నుండి బయటకు వెళ్లకుండా ఇతర రాష్ట్రాల నుండి లోనికి రాకుండా పహారా కాశారు.

 

ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగులు మరియు విద్యార్థులు హాస్టల్లో లాక్ అయిపోవటంతో...అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూను కట్టుదిట్టం చేస్తూ రాష్ట్రంలో రవాణా ని స్తంభింపజేసి ప్రజలను రోడ్డు మీదకు రాకుండా చర్యలు తీసుకోవటంతో ఆంధ్ర ఉద్యోగులు విద్యార్థులు హాస్టల్లో రూముల్లో ఇరుక్కుపోయారు.

 

దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో తమని తమ ఇళ్ల కు పంపించాలని అమీర్ పేట్ మరియు ఎస్ ఆర్ నగర్ హాస్టల్ కు చెందిన వారు అంతా స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర వందలాదిగా గుమిగూడి తమ బాధను విన్నవించుకున్నారు. హాస్టల్స్ లో సరైన సదుపాయాలు లేక ఇక్కట్లు పడుతున్న వారికి పాసులు ఇచ్చి వారిని ఎక్కడా ఎవరూ అడ్డుకోకుండా చేసేందుకు ఏవేవో చేసారు కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఆ సమయంలో ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఎంటర్ అయ్యి మీకు అన్ని విధాలా తోడు ఉంటామని ఏం ప్రాబ్లం లేదని హాస్టల్స్ లో ఉండొచ్చు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

 

మరోపక్క ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ సరిహద్దులు లాక్ అయిపోయి చట్టంతో పరిస్థితిని వాళ్లకి వివరించి పోలీసులు వాళ్ళని ఆ ప్రాంతంలోనే ఉండేటట్టు బాధ్యత తీసుకున్నారు. దీంతో చాలామంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఎంత రాకపోతే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple




మరింత సమాచారం తెలుసుకోండి: