రోజురోజుకూ ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య  720 కు చేరింది. అటు కరోనా బారిన పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే చైనా, ఇటలీ, ఇరాన్, అమెరికా, దక్షిణ కొరియా....ఇంకా పలు దేశాలతో పోలిస్తే, ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య చాలా తక్కువే. పైగా మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా ముందే తేరుకొని కరోనా వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది.

 

ఇప్పటికే జనతా కర్ఫ్యూ పెట్టారు. అలాగే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించారు. అయితే ఇంత చేసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతుంది. ఇక ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్న భారత్, కరోనా కేసులు అంచనా వేయడంలో విఫలమైందని నిపుణులు చెబుతున్నారు. భారత్ ముందే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆపేసి ఉంటే బాగుండేదని, కానీ అప్పుడు అలా చేయకపోవడం, పైగా కరోనా ఉన్నవారికి ఆ లక్షణాలు 14 రోజులు వరకు బయటపడకపోవడం, ఈ లోపు వారు ఎంతమందితో కాంటాక్ట్ అయ్యారో అంచనాకే దక్కడం లేదు.

 

ప్రస్తుతానికి కరోనా బాధితుల సంఖ్య తక్కువగానే ఉన్నా,  కరోనా ఉండి, ఆ లక్షణాలు బయటపడక సాధారణ ప్రజల మధ్యలో తిరగడం వల్ల రానున్న రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో బయటపడుతున్న కరోనా కేసుల ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ చివరి నాటికి లక్షల్లోకి వెళుతుందని అంటున్నారు.

 

ఇక మే నెల రెండో వారం ముగిసేసరికి ఇండియాలో దాదాపు 13 లక్షల కరోనా కేసులు బయటపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈలోపు భారత్ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటే ఆ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాకపోతే కరోనా కేసులు పెరిగేకొద్దీ ఇబ్బందులు పెరుగుతాయని, భారత్ లో తగినన్ని బెడ్స్ లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి ఇండియా పై ఎలాంటి ప్రభావం చూపుతుందో, ప్రభుత్వం దాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో?

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: