దేశంలో అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి రాష్ట్రం లాక్ డౌన్ పాటిస్తుంది. ఇక ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. అటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో జగన్ ప్రభుత్వం కరోనా పై తీవ్రంగా యుద్ధం చేస్తున్నాయి. ఓ వైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూనే, మరోవైపు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

 

అయితే ఈ లాక్ డౌన్ అమలు చేయడంలో జగన్ ప్రభుత్వంతో పోలిస్తే కేసీఆర్ ప్రభుత్వం కాస్త వెనుకే ఉందని తాజా ఘటనలు నిరూపించాయి. లాక్ డౌన్ ఉన్నా సరే కేసీఆర్ ప్రభుత్వం, హైదరాబాద్ లో ఉన్న ఏపీ విద్యార్హులు, ఉద్యోగులకు తమ తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు. కేసీఆర్ పర్మిషన్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగానే ఉంది. సొంత వాళ్ళని ఏపీలో అడుగుపెట్టనివ్వనందుకు బాధగానే ఉన్నా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తప్పడం లేదని జగన్ చెప్పారు.

 

ఇక ఇలా జగన్ ప్రభుత్వం కరోనా పై యుద్ధం చేస్తుంటే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మాత్రం ఒక ప్రశంస ఇవ్వడానికి మనసు రాలేదు.  కరోనా పై బాగా పోరాడుతున్నారని కేసీఆర్ ప్రభుత్వానికి కితాబు ఇచ్చిన పవన్... జగన్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రశంస ఇవ్వలేదు. రైతుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి సలహా ఇచ్చిన పవన్.... కరోనా‌ వ్యాప్తి నిరోధానికి మంచి చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ, కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 

 

ఇలాంటి అల్లకల్లోల సమయాల్లో కేసీఆర్‌ నాయకత్వంలో..మీరు చేపట్టిన చర్యల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు. అలా కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడిన పవన్ కు ...కరోనా పై తీవ్రంగా పోరాటం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని పొగడటానికి మనసు రాలేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: