కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మాత్రం ఈ వైరస్ వరంలా మారింది. ఇప్పటికే దేశమంతటా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే అత్యవసర పరిస్థితుల్లో తప్ప జనాలను పోలీసులు బయటికి రానివ్వడం లేదు అయితే జైళ్లల్లో వుండే ఖైదీలకు కూడా కరోనా సోకే అవకాశం ఉండడంతో మహారాష్ట్ర, పంజాబ్ ప్రభుత్వాలు వారి గురించి కీలక నిర్ణయం తీసుకున్నాయి.
 
మహారాష్ట్ర లో దాదాపు 11000 మంది ఖైదీలు 7ఏళ్ళ లోపు శిక్ష ను కలిగివున్నారు. వీరందరని పెరోల్ పై విడుదలచేయనున్నామని మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశముఖ్ ప్రకటించారు. అలాగే పంజాబ్ కూడా 6000మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇక లాక్ డౌన్ విధించినప్పటికీ ఇండియాలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 700 కు పైగా కరోనా కేసులు నమోదుకాగా అందులో 16 మంది మరణించారు. ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ లో కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుండగా ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడులో కూడా ఈ వైరస్ విజృభిస్తుంది.
 
అందులో భాగంగా ఈఒక్క రోజే తెలంగాణ లో 4పాజిటివ్ కేసులు నమోదు కావడం తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది కాగా తమిళనాడు లో ఈ ఒక్క రోజే 5పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం అక్కడ కరోనా కేసులు సంఖ్య 29కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఒక కరోనా కేసు నమోదు కావడం తో బాధితుల సంఖ్య 11కు చేరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కట్టు దిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది అయినా కూడా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: