కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న  విషయం తెలిసిందే. ఇప్పటికే కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులు తీసుకోవడం కోసం ప్రత్యేక సమయం కేటాయించారు. అలాగే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో నాలుగుచోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో 1902 అనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

 

అటు ఏప్రిల్ 4 నుంచి ప్రతీ ఇంటికి రూ. వెయ్యి రూపాయలు, రేషన్ డోర్ డెలివరీ చేయనున్నారు.  ఇక డాక్టర్లు, నర్సులు, పోలీసులు ఈ కరోనాపై నిత్యం యుద్ధం చేస్తున్నారు. అయితే ఇన్ని రకాలుగా కరోనా పై యుద్ధం చేస్తూ, ప్రజలకు అండగా ఉంటున్న  జగన్ ప్రభుత్వం, మరొక్క పని చేస్తే ప్రజలకు చాలా మేలు జరిగే అవకాశముంది.

 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్కడి ప్రజలని  అక్కడే ఇళ్లల్లో ఉండిపోయారు. అయితే ఇలా ఉండటం వల్ల కొందరు పేద ప్రజలకు తినడానికి తిండి కూడా సరిగా దొరకడం లేదని తెలిసింది. చాలామంది రోడ్ల మీద బ్రతికే వారికి ఒక ముద్ద భోజనం దొరకడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని స్వచ్చంద సంస్థలు బయటకొచ్చి, రోడ్ల మీద ఉన్నవారికి ఎంతోకొంత ఆహారం అందిస్తున్నారు.

 

కాకపోతే గుంపులు గుంపులుగా చేరకూడదు కాబట్టి వారికి బయటకు రావడానికి పర్మిషన్స్ ఉండటం లేదు. అదే ప్రభుత్వమే ఉచిత భోజనం అందిస్తే పేద ప్రజలు ఆకలి తీరుతుంది. ఎలాగో మూతపడిన అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఆహారం అందిస్తే మంచిదని సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే పేదలకు ఉచిత భోజనం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా ఈ కార్యక్రమం కూడా చేస్తే జగన్ ని ప్రజలు జీవితంలో మరిచిపోలేరు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: