ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు భయపడుతూ వస్తున్నారు..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సకల నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. ఇప్పుడు కూడా అదే జరిగింది.. 

 

 

 

ఇకపోతే కరోనా భయం జైల్లో ఖైదీలకు కూడా పట్టుకుంది...తమతో పాటు జైల్లో ఉంటున్న ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ రావడంతో ప్రాణభయంతో 9 మంది మహిళా ఖైదీలు ఏకంగా జైలు నుంచి పరారైన సంఘటన వెలుగుచూసింది. ఈ ఘటన అమెరికాలోని సౌత్ డకోటాలో చోటుచేసుకుంది. యూఎస్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సౌత్ డకోటా జైలు అధికారులు ఖైదీలతో సందర్శనలను పూర్తి ఆపివేశారు.. 

 

 

 

జైల్లో కరోనా ఉందని తెలుసుకున్న మహిళ ఖైదీలు జైలులో ఉంటున్న ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో భయాందోళనకు గురైన 9 మంది మహిళా ఖైదీలు జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. తొలుత 8 మంది మాత్రమే తప్పించుకున్నారని ప్రకటించినప్పటికీ.. 9 మంది పారిపోయినట్లు గవర్నర్ ధ్రువీకరించారు. ఫిలోమెన్ బోన్‌షర్ట్, జోర్డాన్ వేక్‌మన్, సిల్వియా రెడ్ లీఫ్, ఆలిస్ రిచర్డ్స్, కైలా లామోంట్, కార్లీ స్కోన్‌మాన్, పమేలా మిల్లెర్, కెల్సే ఫ్లూట్ అనే మహిళా ఖైదీలు జైలు నుంచి పారిపోయారు.. 

 

 

 

పరారైన తొమ్మిది మంది మహిళా ఖైదీల్లో ముగ్గురినీ పట్టుకున్నారు...మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలు నుంచి పారిపోవడం ద్వారా మరో నేరం చేసినట్టయింది. వారికి మరో ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనే గతం వారం కోల్‌కతాలోని దమ్‌ దమ్ జైలులో చోటుచేసుకుంది. అయితే ఖైదీలు అధికారులపై దాడికి దిగడంతో వాళ్ళు టియర్ గ్యాస్ ను ప్రయోగించి అదుపుచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: