సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా ఇంకా కొందరు ప్రజలు మూఢనమ్మకాలను బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మా ఊరిలోను జరిగింది. మా ఊరు అంటే అనంతపురంలోని చిన్న గ్రామం. ఉదయం 3:30 నిమిషాలకు డోర్ కొట్టారు.. అమ్మ చూడు ఎవరో టాబ్లెట్స్ కోసం వచ్చారు అంటూ హెల్త్ అసిస్టెంట్ అయినా మా అమ్మను పిలిచి లేపా.. ఎందుకంటే మా ఊరిలో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చిన.. ఏ అర్ధరాత్రి అయినా మా ఇంటి తలుపులు కొట్టి చికిత్స పొందుతారు.  

 

 ఇంకా ఈ విషయం పక్కన పెడితే.. మా ఊరిలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గ్రామాలలో ఇదే మూడ నమ్మకం. ఎక్కడో రెండు చోట్లా ఆవు కడుపునా పాప పుట్టింది అని ఆ పాప మాట్లాడింది అని.. రాష్ట్రానికి కీడు వచ్చింది అని ఈరోజు అంత లెయ్యాలి అని.. ఎవరు పడుకోకూడదు అని.. అందరూ మేల్కొని భర్త ఉన్న వారు చేతికి పసుపు కొమ్మ కట్టుకోవాలి అని.. అలా కాదు అని పడుకుంటే పడుకున్న వారు పడుకున్నట్టే చస్తారు అని ప్రచారం చేశారు. ఇందుకు మా అమ్మమ్మా వచ్చి తిట్టి మరి అందరిని లేపింది. ఏమైంది అంటే? కదిరి నుండి.. పుట్టపర్తి నుండి.. కర్నూల్ నుండి నాకు ఫోన్లు వచ్చాయి.. మేలుకోవాలి అని.. అందుకే లెయ్యండి అంటుంది. 

 

ఇంకా మేము అయినా ఎం చేస్తాం.. ఎంత చదువుకుంటే ఏంటి? ఎంత సైన్స్ కాలం అయితే ఏంటి? గతంలోనూ ఇలా కీడు అని చెప్పినప్పుడు.. ఫేక్ అని కొట్టిపారేయడంతో అప్పట్లో కేవలం మూడు నెలలలోనే ఇంట్లో ఒక మనిషిని పోగొట్టుకున్నాం. అందుకే ఎక్కడ? ఈ కీడు జరుగుతుందో అనే భయంతో అది నిజమో కాదో తెలియకపోయిన.. అది నమ్మదగ్గ విషయం కాకపోయినా ఇంట్లో అందరూ లేచి కూర్చున్నాం. ఇది తప్పుడు ప్రచారం అని చెప్పేసరికి మా వాట్సాప్ లకు ఫోన్లు వచ్చాయి. ఇది పరిస్థితి. ఇలా ప్రచారాలు జరుగుతులే ఉంటాయి.. మొన్న కరోనా వైరస్ కు మాయం కావాలి అంటే 5 ఇళ్లల్లో నీళ్లు వేప చెట్టుకు పోసి టెంకాయి కొట్టాలి అని ప్రచారం చేశారు... ఇంకా వూరికే ఉంటారా? అందరూ టెంకాయి కొట్టారు.'' అంటూ ఓ నెటిజన్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇలాంటి ప్రచారాలు నమ్మకండి అని చెప్పలేం.. ఎందుకంటే ఎవరి నమ్మకం వారిది.. కానీ చదువుకున్నారు కాబట్టి.. ఏ ప్రచారం నిజం.. ఏ ప్రచారంలో అబద్దం అనేది తెలుసుకుంటే ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: