నవరసాల్లో ఒకటైన శృంగారం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డౌట్స్ వచ్చే టాపిక్ 'సెక్స్' అంటే నమ్ముతారా..?, ప్రపంచంలో ఎక్కువ శాతం భార్యాభర్తలు విడాకులు తీసుకుంటుంది సెక్స్ మూలంగానే అని మీరు ఎప్పుడైనా విన్నారా..? అవునండీ.. అది నిజమే. ప్రపంచ వ్యాప్తంగా శృంగారంపై సర్వే చేసిన ఒక సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్కువ మంది జంటలు శృంగారంలో తృప్తిని పొందలేక జరిగే గొడవలతోనే విడిపోతున్నారని తెలిసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో రెండో స్థానంలో ఉన్న మన దేశంలో కూడా సెక్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువే. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ 'గూగుల్'లో గత సంవత్సరం ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలెబ్రిటీ ఎవరో తెలుసా..?, శృంగార తార సన్నీలియోన్. ఒక శృంగార తార గురించే ఇంతలా వెతికిన మన వాళ్ళు ఇంక పోర్న్ గురించి వెతకాకుండా ఉండగలరా?. అయితే వారిలో కొందరు బానిసలుగా, సెక్స్ ని వ్యసనంగా మార్చుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు.

 

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒక ప్రముఖ సంస్థ దేశ వ్యాప్తంగా సర్వే చేసి 'పోర్న్ అడిక్షన్ స్టాటిస్టిక్స్' రిపోర్టును రిలీజ్ చేసిందట. ఈ సర్వే ప్రకారం 'పోర్న్ అడిక్షన్ స్టాటిస్టిక్స్'లో మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా 30వ ర్యాంక్ సాధించగా, ఆంధ్రప్రదేశ్ 34వ ర్యాంకును సొంతం చేసుకుందట. ఇదిలా ఉండగా ఈ సంస్థ రాష్ట్రాల్లో కూడా ప్రాంతాల వారీగా ర్యాంకులను ప్రకటించిందట. వాటిలో తెలంగాణా ప్రాంతం నుండి మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉండగా హైద్రాబాద్, వరంగల్ లు 2, 3 స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా కరీంనగర్, సికింద్రాబాద్ ప్రాంతాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతాలైన ఎమ్మిగనూరు మొదటి ర్యాంక్ సాధించగా హిందూపూర్ రెండో స్టాంజంలో నిలిచింది. చిత్తూర్ మరియు ఆదోని ప్రాంతాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ స్టాటిటిక్స్ ని బట్టే తెలుస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఏయే ప్రాంతాల్లో పోర్న్ ప్రభావం ఎక్కువగా ఉందో. దీనిపై స్పందించిన పలువురు సెక్సాలజిస్టులు శృంగారం తప్పు కాదని, యవ్వన దశలో ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి చూసేదే అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: