కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. ప్రముఖులు, సినీనటులు, పారిశ్రామిక వేత్తలు.. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వారు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజా ఏపీ ఉద్యోగులు సైతం కరోనా బాధితుల కోసం సాయం చేసేందుకు ముందు వచ్చారు. తమ పెద్ద మనసు చాటుకున్నారు.

 

 

కరోనా ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్ర ప్రదేశ్ ఎన్జీవోలు తమ వంతు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ ను క్యాంపు కార్యాలయంలో కలిసి ఉద్యోగ సంఘాల నేతలు లేఖలు సమర్పించారు. ఒకరోజు జీతం విరాళం ద్వారా దాదాపు రూ.100 కోట్లు సమకూరుతాయని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి తెలిపారు. కరోనా నివారణ కోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయని వెంకట్రామిరెడ్డి ప్రశంసించారు.

 

 

ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ఒక్క ప్రభుత్వాలు పూనుకుంటే సరిపోదు. ఇలాంటి సమయంలోనే ప్రజలంతా ఐక్యంగా ఉన్నామని చాటుకునే అవసరం సందర్భం కూడా. అందుకే అన్ని వర్గాల వారు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందకు వస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన రూ. 100 కోట్ల విరాళం ప్రకటించిన కార్యక్రమానికి ఉద్యోగ సంఘాల నేతలు పలువురు హాజరయ్యారు.

 

 

వారిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి, అదనపు కార్యదర్శి కత్తి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు వై.వి.రావు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమేశ్వర్రావు తదితరులు ఉన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: