కరోనా వైరస్ ని అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధి ఎప్పుడో ఫిబ్రవరి 2 న భారత్ లో కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, భారత ఆర్ధిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఆ తర్వాత ఈ నెల మొదటి వారంలో కూడా ఆయన ఇదే విధంగా హెచ్చరించారు. అయితే దీన్ని కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. మనకు కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదనే ప్రచారమే ఎక్కువగా చేసారు. 

 

మనకు కరోనా వైరస్ అసలు వచ్చే అవకాశం లేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ ని అంచనా వేయలేకపోయింది అంటూ మోడీ సర్కార్ కనీస జాగ్రత్తలు తీసుకోలేదని... ఇటలీలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్రం అంతర్జాతీయ విమానాలను ఆపకుండా సాహసం చేసింది అనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో కేంద్రం చాలా వరకు లైట్ తీసుకుంది అంటూ పలువురు మండిపడుతున్నారు. సరిహద్దులను గానీ అంతర్జాతీయ విమానాశ్రయాలను కూడా ఆపేదని అంటున్నారు. 

 

ఇప్పుడు పరిస్థితి భారత్ లో చేయి దాటింది అనే వాళ్ళు ఉన్నారు. మన దేశంలో పరిస్థితి ప్రభుత్వం చర్యలు తీసుకునే స్థాయిలో లేదని అనే వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా వైరస్ అనేది మన దేశం మొత్తం విస్తరించింది అని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ కారణంగా ఇది ఎక్కువగా మన గ్రామాలకు కూడా వెళ్ళిపోయిందని ఆస్పత్రులు కూడా సరిపోయే పరిస్థితి ఉండదు అని అంటున్నారు. దీన్ని రాకుండా ఆపడమే గాని వచ్చిన తర్వాత ఆపడానికి ఏమీ లేదని అసలు అది కంట్రోల్ అయ్యే అవకాశాలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle 

 

apple : https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: